టీడీపీ పోటీ చేయకపోవడం వల్లే గెలిచాం..

రేవంత్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. రేవంత్ తెలంగాణకు సీఎం అయినా టీడీపీపై ఉన్న ప్రేమ అలాగే ఉందని కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement
Update: 2024-06-28 09:10 GMT

తన పాత పార్టీ తెలుగుదేశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీచేసి ఉంటే కాంగ్రెస్‌ పరిస్థితి ఎలా ఉండేదోనని ఆయన అనుమానం వ్యక్తంచేశారు. టీడీపీ పోటీ చేసుంటే కనీసం 10శాతం ఓట్లు దక్కించుకునేదని చెప్పారు. అప్పుడు కచ్చితంగా తమ పార్టీ గెలుపోటములపై ప్ర‌భావం ప‌డేద‌ని అభిప్రాయపడ్డారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. రేవంత్ తెలంగాణకు సీఎం అయినా టీడీపీపై ఉన్న ప్రేమ అలాగే ఉందని కామెంట్స్ చేస్తున్నారు. గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకునే కదా కూటమి ఎన్నికలకు వెళ్లింది.. మరి అప్పుడు ఎందుకు గెలవలేదని ప్రశ్నిస్తున్నారు. తన గురువుకు క్రెడిట్ ఇవ్వకుండా రేవంత్ ఉండలేకపోతున్నారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌ చేసిన సీఎం ఈ కామెంట్లు చేశారు.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపైనా పొగడ్తల వర్షం కురించారు రేవంత్. ఏపీలో చంద్రబాబునాయుడు 23 సీట్లు వచ్చినా కోర్‌ రాజకీయాలను వదలకుండా పోరాడారని, అందుకే మళ్లీ గెలవగలిగారని అన్నారు. తెలంగాణలో కేసీఆర్‌ పరిస్థితి అలా లేదన్నారు. బీఆర్‌ఎస్‌ వాళ్లు వారి ఓట్లు వారే వేసుకొని ఉంటే కాంగ్రెస్‌ 12 సీట్లు గెలిచేదని.. కవర్ చేసుకున్నారు. చంద్రబాబునాయుడిని కించపరిచేలా మాట్లాడనని, ఆయనని అనాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.

Tags:    
Advertisement

Similar News