ఢిల్లీలో కాంగ్రెస్ ఓటమిపై సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
ఇండియా కూటమిలోని ప్రతి పార్టీ అన్నీ సీట్లు తమకే కావాలని అనుకోవడంతో కాంగ్రెస్‌కు మైనస్ అవుతుందని సీఎం రేవంత్ అన్నారు
ఢిల్లీ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఓటమిపై సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేరళలోని తిరువనంతపురంలో జరుగుతున్న మాతృభూమి ఇంటర్‌నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ సదస్సులో పాల్గోన్నారు .ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతు ఇండియా కూటమిలోని ప్రతి పార్టీ అన్నీ తమకే కావాలని కోరుకుంటున్నాయి. అదే పెద్ద మైనస్. హరియాణా రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ ఓడిపోయిందని రేవంత్ అన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ అదే పని చేయడంతో వల్ల ఆప్ ఓడిపోయిందని ఆయన పేర్కొన్నారు.60 ఏళ్ల తెలంగాణ ప్రజల కలను నెరవేర్చినందున తెలంగాణ ప్రజలు సోనియా గాంధీని ఎంతగానో ప్రేమిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం తెలంగాణ జీడీపీ సుమారు 200 మిలియన్ యూఎస్ డాలర్లుగా ఉందని.. 2035 నాటికి దానిని ఒక బిలియన్ యూఎస్ డాలర్లుగా మార్చాలనుకుంటున్నామని అన్నారు. హైదరాబాద్ కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్ అనే మూడు జోన్లుగా విభజించామని అన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు మేం పలు కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.
దేశంలోని ముంబయి, ఢిల్లీ, బెంగళూర్, చెన్నై వంటి నగరాలతో కాకుండా ప్రపంచంలోని ముఖ్య నగరాలైన న్యూయార్క్, లండన్, సింగపూర్, టోక్యో, సియోల్ వంటి నగరాలతో పోటీపడేలా హైదరాబాద్ ఉండాలనుకుంటున్నామని ఈ సమావేశంలో రేవంత్ వెల్లడించారు. కేజ్రీవాల్… యాంటీ కేజ్రీవాల్ లాగే పోలింగ్ జరిగిందని వివరించారు. దీంతో… కేజ్రీవాల్ యాంటీ ఓటు బీజేపీ పార్టీకి వెళ్ళిందని క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో కూడా అలాగే జరిగిందని వివరించారు. కేంద్రం మాకు సహకరించడం లేదని ఆగ్రహించారు. ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు కేంద్రం సహకరించడం లేదు.. దక్షిణాది రాష్ట్రాల మీద ఎందుకు వివక్ష అంటూ నిలదీశారు రేవంత్ రెడ్డి. దక్షిణాది రాష్ట్రాలకు ప్రధాని మోడీ ప్రమాదకరం అన్నారు. దక్షిణాది రాష్ట్రాల ప్రజలు ఏకం అవ్వాల్సిన అవసరం ఉంది.. వన్ నేషన్-వన్ ఎలక్షన్ రాష్ట్రాల హక్కులను హరించేలా ఉందని ముఖ్యమంత్రి మండిపడ్డారు