రేవంత్‌ ఫారిన్‌ టూర్‌.. టీమ్‌లో ఆయనెందుకు..?

గతేడాది జనవరి మూడో వారంలో WEF సదస్సు జరగ్గా.. అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని బృందం హాజరైంది. దాదాపు రూ.21 వేల కోట్ల పెట్టుబ‌డులను తీసుకువచ్చింది.

Advertisement
Update:2024-01-10 10:21 IST

సీఎం రేవంత్‌ రెడ్డి ఫారిన్‌ టూర్‌ ఖరారైంది. ఈ నెల 15న ఆయన స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 18 వరకు రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన కొనసాగనుంది. సీఎం హోదాలో రేవంత్ రెడ్డికి ఇదే తొలి విదేశి పర్యటన.

దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనమిక్‌ ఫోరంలో పాల్గొన‌డంతో పాటు లండన్‌లోనూ ఆయన పర్యటిస్తారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొననున్న సీఎం.. ప్రముఖ కంపెనీల సీఈవోలతో సమావేశం కానున్నారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరిస్తారు. గతేడాది జనవరి మూడో వారంలో WEF సదస్సు జరగ్గా.. అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని బృందం హాజరైంది. దాదాపు రూ.21 వేల కోట్ల పెట్టుబ‌డులను తీసుకువచ్చింది.

దావోస్ పర్యటన కోసం 8 మంది సభ్యుల బృందం సీఎం రేవంత్ రెడ్డి వెంట వెళ్లనుంది. ఇందులో సీఎం ముఖ్యకార్యదర్శి వీ. శేషాద్రి, ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌, పెట్టుబడులు, ప్రచారం, విదేశీ వ్యవహారాల ముఖ్యకార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి ఉన్నారు. అయితే రేవంత్ వెంట వెళ్తున్న బృందంలో ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఉదయ్‌సింహ ఉండటం చర్చనీయాంశమైంది.

Tags:    
Advertisement

Similar News