కేసీఆర్ పోయేదెప్పుడు, విగ్రహం పెట్టేదెప్పుడు.. సీఎం రేవంత్ వివాదాస్పద వ్యాఖ్యలు
సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటును బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించి ఆ స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు కేటీఆర్. కేటీఆర్ వ్యాఖ్యలపై రేవంత్ మండిపడ్డారు.
సెక్రటేరియట్ ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించి తెలంగాణ తల్లి విగ్రహం పెడతామన్న కేటీఆర్ వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. కేటీఆర్‌కు అధికారం పోయినప్పటికీ బలుపు తగ్గలేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సెక్రటేరియట్ ఎదుట కేటీఆర్ వాళ్ల అయ్య (కేసీఆర్) విగ్రహం పెట్టాలనుకున్నాడని ఆరోపించారు రేవంత్. కేటీఆర్ అయ్య పోయేదెప్పుడు.. విగ్రహం పెట్టేది ఎప్పుడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రేవంత్. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సోమాజిగూడలోని ఆయన విగ్రహానికి నివాళులర్పించారు రేవంత్ రెడ్డి.
రాజీవ్ గాంధీది దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన కుటుంబమని, దేశం కోసం రెండు తరాలు ప్రాణాలిచ్చిన కుటుంబమని చెప్పారు రేవంత్. అమరవీరుల స్తూపం పక్కన దేశం కోసం అమరుడైన రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం సముచితమన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముట్టుకుంటే చెప్పులతో కొడుతామన్నారు. కేటీఆర్‌కు అధికారం కలలో కూడా రాదన్నారు రేవంత్ రెడ్డి. గత పదేళ్లలో సెక్రటేరియట్‌లో తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టలేదన్నారు. తెలంగాణ తల్లి గురించి మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్‌కు లేదన్నారు రేవంత్ రెడ్డి. డిసెంబర్ 9, 2024 నాడు సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. మా చిత్తశుద్ధిని ఎవరు ప్రశ్నించాల్సిన అవసరం లేదన్నారు రేవంత్ రెడ్డి.
సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటును బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించి ఆ స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు కేటీఆర్. కేటీఆర్ వ్యాఖ్యలపై రేవంత్ మండిపడ్డారు.