ప్రజలకు శుభాకాంక్షలు.. బీఆర్ఎస్ పై సెటైర్లు

ఈ రోజుతో తెలంగాణ స్వరాష్ట్రానికి సంపూర్ణ విముక్తి లభించిందని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామన్నారు రేవంత్ రెడ్డి.

Advertisement
Update:2024-06-02 10:01 IST

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని, ప్రజా పాలనను అందిస్తామని చెప్పారు. అన్ని రంగాల్లోనూ తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచేలా చేస్తామన్నారు. భవిష్యత్తు ప్రణాళికలు, సరికొత్త విధానాల రూపకల్పన ఇప్పటికే మొదలైందన్నారు రేవంత్ రెడ్డి.

బీఆర్ఎస్ పై సెటైర్లు..

అధికారంలోకి వచ్చినప్పటినుంచి బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తూనే ఉన్నారు కాంగ్రెస్ నేతలు. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో మరో అడుగు ముందున్నారు. తాజాగా ప్రజలకు శుభాకాంక్షలు చెబుతూనే పరోక్షంగా బీఆర్ఎస్ పై విమర్శలు ఎక్కుపెట్టారాయన. గత పదేళ్లలో తెలంగాణలో విధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెట్టడంతో పాటు, ఇంతకాలం కోల్పోయిన ప్రజాస్వామిక వాతావరణాన్ని పునరుద్ధరిస్తామని అన్నారు రేవంత్ రెడ్డి. ప్రజలు కలసికట్టుగా పోరాటడి సాధించుకున్న రాష్ట్రం ఇదని అన్నారు. కేసీఆర్ ఎపిసోడ్ ని ఎక్కడా ఆయన ప్రస్తావించకపోవడం గమనార్హం. పైగా పదేళ్లలో పాలన విధ్వంసం జరిగిందంటూ కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి.

సంపూర్ణ విముక్తి..

విభజన చట్టం ప్రకారం ఇంతకాలం ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ ఇకపై తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఉంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇకపై విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో సింహభాగం తెలంగాణ రాష్ట్ర ప్రజలకే దక్కుతాయని పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్‌ 2వ తేదీకి అత్యంత ప్రాధాన్యం ఉందని, ఈ రోజుతో తెలంగాణ స్వరాష్ట్రానికి సంపూర్ణ విముక్తి లభించిందని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామన్నారు రేవంత్ రెడ్డి.

Tags:    
Advertisement

Similar News