ముస్లిం సోదరులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

పవిత్ర రంజాన్‌ మాసం ప్రారంభమైన సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.;

Advertisement
Update:2025-03-01 21:18 IST

పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్బంగా ముస్లిం సోదర, సోదరీమణులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.మానవ సేవ చేయాలనే సందేశాన్ని రంజాన్‌ పండుగ సమస్త మానవాళికి అందిస్తుందన్నారు. రంజాన్‌ మాసంలో ముస్లింలు ఆచరించే కఠోర ఉపవాసం, దైవ ప్రార్థనలు ఆధ్మాత్మికతను, క్రమశిక్షణను పెంపొందిస్తాయన్నారు. లౌకికవాదం, మత సామరస్య పరిరక్షణలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిస్తోందన్నారు. ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు. ముస్లింల అభ్యున్నతికి తోడ్పడే కార్యక్రమాలు అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. ముస్లిం సోదరులు రంజాన్ వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని, అల్లా దీవెనలు పొందాలని సీఎం రేవంత్ ఆకాంక్షించారు. ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం చిత్తశుద్దితో పని చేస్తుందన్నారు.

Tags:    
Advertisement

Similar News