నేడు వేములవాడలో పర్యటించనున్న సీఎం రేవంత్‌

సీఎం పర్యటన దృష్ట్యా బీఆర్‌ఎస్‌ నేతల ముందస్తు అరెస్ట్‌

Advertisement
Update:2024-11-20 09:46 IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడలో సీఎం రేవంత్‌రెడ్డి నేడు పర్యటించనున్నారు. రూ. 500 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. సీఎం ఉదయం 10 గంటల ప్రాంతంలో అక్కడి చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా ఆలయానికి వెళ్లి నేరుగా ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత శృంగేరి పీఠాధిపతి సూచనల మేరకు పలు శంకుస్థాపనలు చేయనున్నారు. దేవాలయ అభివృద్ధికి రూ. 127 కోట్లతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేస్తారు.ఆలయ అభివృద్ధితో పాటు, మెడికల్‌ కాలేజీ భవనం తదతర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. సీఎం తొలిసారి ఇక్కడికి వస్తున్నారు కాబట్టి భారీ ఎత్తున జనాలను తరలించడానికి నాయకులు యత్నిస్తున్నారు. 11: 30 గంటలకు ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాలు బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తారు. మిడ్‌ మానేరు నిర్వాసితులు అక్కడికి వచ్చారు. వారికి సమస్యల పరిష్కారంతో పాటు, పరిహారం అందిస్తారని భావిస్తున్నారు.

సీఎం పర్యటన నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ నేతలను ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు. మిడ్‌ మానేను నిర్వాసితులకు న్యాయం చేయడంతో పాటు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఇప్పటికే గులాబీ నేతలు డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయలేదు కాబట్టి సీఎం పర్యటను అడ్డుకుంటామని అనడంతో అర్ధరాత్రి నుంచి అరెస్ట్‌ చేస్తూ పోలీస్‌ స్టేషన్లకు తరలిస్తున్నారు. సీఎం పర్యటన దృష్ట్యా ఎలాంటి అడ్డంకులు లేకుండా పటిష్ట బందోబస్తు చేపట్టారు. 

Tags:    
Advertisement

Similar News