భయపడేదే లేదు.. నోటీసులపై రేవంత్ రెడ్డి
రిజర్వేషన్లను రద్దు చేస్తామంటూ అమిత్ షా మాట్లాడినట్లు ఓ ఫేక్ వీడియోను క్రియేట్ చేసి వైరల్ చేసిన కేసులో ఢిల్లీ పోలీసులు.. సీఎం రేవంత్ సహా పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు నోటీసులు జారీ చేశారు.
అమిత్ షా డీప్ ఫేక్ వీడియో కేసులో తనకు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇవ్వడంపై స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ పోలీసులకు భయపడేది లేదన్నారు. బీజేపీపై పోరాడేవారికి అమిత్ షా నోటీసులు ఇస్తున్నారని ఆరోపించారు. బీజేపీని ప్రశ్నించినందుకే తనకు నోటీసులిచ్చారని చెప్పారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులను పంపిస్తున్నారని ఆరోపించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
రిజర్వేషన్లను రద్దు చేస్తామంటూ అమిత్ షా మాట్లాడినట్లు ఓ ఫేక్ వీడియోను క్రియేట్ చేసి వైరల్ చేసిన కేసులో ఢిల్లీ పోలీసులు.. సీఎం రేవంత్ సహా పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు గాంధీభవన్‌కు వచ్చిన ఢిల్లీ పోలీసులు CRPC-91 సెక్షన్ కింద ఈ నోటీసులు ఇచ్చారు.
ఇక అమిత్ షా డీప్ ఫేక్ వీడియో కేసులో ఓ వ్యక్తిని అరెస్టు చేశారు పోలీసులు. రిథోమ్ సింగ్ అనే వ్యక్తిని అస్సాం పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వశర్మ సైతం ధ్రువీకరించారు.