రేవంత్ రెడ్డిపై సభా హక్కుల ఉల్లంఘన ఫిర్యాదు

పోతిరెడ్డిపాడు విషయంలోనూ సీఎం సభను సీఎం తప్పుదోవ పట్టించారన్నారు. ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన కింద ఫిర్యాదు చేస్తామన్నారు హరీష్ రావు.

Advertisement
Update:2024-07-29 19:58 IST

సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీని తప్పుదోవ పట్టించారని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రభుత్వం డిఫెన్స్‌లో పడిన ప్రతిసారీ ఆయన ఏదో ఒక కాగితం తీసుకొచ్చి చర్చను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ఇప్పటికి మూడుసార్లు ఆయన ఇదే పని చేశారని విమర్శించారు. గతంలో గోదావరి జలాలకు సంబంధించి రిటైర్డ్ ఇంజినీర్ల నివేదికను ప్రస్తావించారని, మేడిగడ్డ సాధ్యం కాదని వారు చెప్పకపోయినా ఆ నివేదికలో అలా ఉన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చదివి వినిపించారని చెప్పారు. వ్యవసాయ మోటర్లకు విద్యుత్‌ మీటర్ల విషయంలో కూడా సీఎం ఉన్నది ఉన్నట్టుగా చదవలేదని, ఉద్దేశపూర్వకంగానే మూడు పదాలు ఎగరగొట్టి చదివారని అన్నారు. పోతిరెడ్డిపాడు విషయంలోనూ సీఎం సభను సీఎం తప్పుదోవ పట్టించారన్నారు. ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన కింద ఫిర్యాదు చేస్తామన్నారు హరీష్ రావు.

పదవుల కోసం పాకులాడేది తాము కాదని, తమపై ఆరోపణలు చేస్తున్న సీఎం రేవంత్ పదవులకోసం పాకులాడే నాయకుడని విమర్శించారు హరీష్ రావు. చివరకు అమరవీరులను కించపరిచేలా సీఎం మాట్లాడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ ఎక్కడికీ పోదని, తప్పకుండా మళ్లీ వస్తుందని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన పథకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం మంగళం పాడిందని విమర్శించారు హరీష్ రావు. పాఠశాలల్లో పారిశుధ్యం, మనఊరు- మనబడి పనులు నిలిపివేశారని అన్నారు.

రెండో విడత గొర్రెల పంపిణీ చేపట్టలేదని, ఆర్టీసీ విలీనం అపాయింట్‌ డే ఇంకా ప్రకటించలేదన్నారు హరీష్ రావు. శాంతిభద్రతల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ కిట్ పథకం కూడా నిలిపివేశారని చెప్పారు. గతంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం రూ. 20వేల కోట్లు చెల్లింపులు చేశామని, కొత్త ప్రభుత్వం గత 8 నెలల్లో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు హరీష్ రావు. 

Tags:    
Advertisement

Similar News