గవర్నర్‌ తో సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ

రాజ్‌ భవన్‌ కు సీఎం రేవంత్‌, మంత్రులు

Advertisement
Update:2024-11-06 19:37 IST

రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌ వర్మతో సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ అయ్యారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి బుధవారం సాయంత్రం రాజ్‌ భవన్‌ కు వెళ్లిన సీఎం గవర్నర్‌ తో మర్యాద పూర్వకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రారంభించిన సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే గురించి గవర్నర్ కు సీఎం వివరించారు. ఈ సర్వేతో తెలంగాణ దేశానికే రోల్ మోడల్ గా నిలవనుందని తెలిపారు. 2025 చేపట్టే దేశవ్యాప్త జనగణలో తెలంగాణ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేను పరిగణలోకి తీసుకునే అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. తన సోదరుడి కుమార్తె వివాహానికి రావాలని గవర్నర్‌ ను సీఎం ఆహ్వానించారు. సీఎం వెంట ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్‌ రెడ్డి, షబ్బీర్‌ అలీ, ఎంపీలు బలరాం నాయక్‌, కిరణ్‌ కుమార్‌ రెడ్డి, రాజ్‌ భవన్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం తదితరులు ఉన్నారు.

Tags:    
Advertisement

Similar News