నేను జానారెడ్డిని కాదు.. రేవంత్ రెడ్డిని

పేదలకు కేసీఆర్ డబుల్‌ బెడ్రూం కట్టించలేదన్న రేవంత్ రెడ్డి.. తాను మాత్రం కేసీఆర్‌కు చర్లపల్లి జైలులో డబుల్‌ బెడ్రూం ఇల్లు కట్టిస్తానన్నారు.

Advertisement
Update:2024-04-06 21:38 IST

తుక్కుగూడలో నిర్వహించిన సభలో రెచ్చిపోయారు సీఎం రేవంత్ రెడ్డి. మాజీ సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాలు విరిగిందని, బిడ్డ జైలుకు పోయిందని ఇన్నాళ్లూ కేసీఆర్‌ను పెద్దగా ఏమి అనలేదన్నారు రేవంత్. త్వరలోనే కేసీఆర్‌కు చర్లపల్లి జైలులో చిప్పకూడు తినిపిస్తానన్నారు. తాను పెద్దలు జానారెడ్డిని కాదని.. రేవంత్‌ రెడ్డినన్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు తలుచుకుంటే ఏం జరుగుతుందో చూపిస్తానన్నారు.


పది సంవత్సరాల BRS పాలనలో వందేళ్ల విధ్వంసం చేశారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. పేదలకు కేసీఆర్ డబుల్‌ బెడ్రూం కట్టించలేదన్న రేవంత్ రెడ్డి.. తాను మాత్రం కేసీఆర్‌కు చర్లపల్లి జైలులో డబుల్‌ బెడ్రూం ఇల్లు కట్టిస్తానన్నారు. అల్లుడు, కోడలు, కోడుకు వచ్చినా ఉండేటట్లు ఏర్పాట్లు చేస్తానన్నారు.

గుజరాత్‌ మోడల్‌తో వైబ్రంట్ తెలంగాణ పోటీ పడేలా చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణకు ఏం తీసుకురాలేని సిగ్గులేని వ్యక్తంటూ కిషన్‌ రెడ్డిపై ఫైర్ అయ్యారు రేవంత్. నమో అంటే నమ్మితే మోసమన్నారు రేవంత్. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో మోడీ పరివారమైన ఈవీఎం, ఈడీ, ఐటీ, సీబీఐలను ఓడించి తీరుతామన్నారు రేవంత్.

Tags:    
Advertisement

Similar News