మహిళల కోసం టీ-సేఫ్ యాప్.. ఎలా పని చేస్తుందంటే.!
గూగుల్ ప్లే స్టోర్ టీ-సేఫ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. T-SAFE వెబ్‌పేజీలో అందుబాటులో ఉన్న ట్రావెల్ సేఫ్ అప్లికేషన్ ద్వారా కూడా ఈ సేవలను పొందవచ్చు.
Advertisement
మహిళల ప్రయాణ భద్రత పర్యవేక్షణకు టీ-సేఫ్ యాప్‌ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. T-SAFE యాప్ ద్వారా మహిళల భద్రత, ప్రయాణ పర్యవేక్షణ సేవలను తెలంగాణ పోలీసులు అందించనున్నారు. అన్ని రకాల మొబైల్ ఫోన్‌లకు అనుకూలంగా ఈ యాప్‌ను రూపొందించారు.
గూగుల్ ప్లే స్టోర్ టీ-సేఫ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. T-SAFE వెబ్‌పేజీలో అందుబాటులో ఉన్న ట్రావెల్ సేఫ్ అప్లికేషన్ ద్వారా కూడా ఈ సేవలను పొందవచ్చు. దేశంలోనే మొదటిసారిగా మహిళల ప్రయాణ భద్రత కోసం ఈ యాప్‌ను తెలంగాణలో తీసుకువచ్చారు.
100 లేదా 112 నంబర్‌కు డయల్ చేసి IVRలో 8ని ఎంపిక చేసుకోవడం ద్వారా కూడా దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ప్రయాణంలో అత్యవసర పరిస్థితులు ఏర్పడితే పోలీసుల సహాయం కోరవచ్చు. దాంతో పాటు కుటుంబసభ్యులకు లోకేషన్ షేర్ చేసేలా వెసులుబాటు కల్పించారు.
Advertisement