సీఎం, పీసీసీ అధ్యక్షుడి ఢిల్లీ టూర్‌

మంత్రి వర్గ విస్తరణ, నామినేటెడ్‌ పోస్టుల భర్తీ, పీసీసీ కార్యవర్గ కూర్పుపై చర్చించే అవకాశం ఉన్నట్లు పార్టీ శ్రేణుల్లో ప్రచారం

Advertisement
Update:2025-01-15 07:01 IST

ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొనడానికి సీఎం రేవంత్‌ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, మంత్రులు, కాంగ్రెస్‌ నేతలు కూడా హస్తిన వెళ్లారు. బుధవారం ఏఐసీసీ కార్యాలయం ప్రారంభం అనంతరం సీఎం, పీసీసీ అధ్యక్షుడు ఏఐసీసీ నేతలను కలిసే అవకాశం ఉన్నది. మంత్రి వర్గ విస్తరణ, నామినేటెడ్‌ పోస్టుల భర్తీ, పీసీసీ కార్యవర్గ కూర్పుపై చర్చించే అవకాశం ఉన్నట్లు పార్టీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతున్నది. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు బృందం 16న ఢిల్లీ నుంచి సింగపూర్‌ వెళ్తారు. ఈ నెల 19 వరకు సింగపూర్‌లో పర్యటించి.. స్కిల్‌ యూనివర్సిటీ భాగస్వామ్యంపై ఒప్పందాలు.. పారిశ్రామిక పెట్టుబడులపై సీఎం బృందం చర్చించనున్నది. ఈ నెల 20 నుంచి 22 వరకు దావోస్‌లో పర్యటించనున్నారు. 

Tags:    
Advertisement

Similar News