ఈ రోజు 8 మెడికల్ కాలేజ్ లను ప్రారంభించనున్న కేసీఆర్
Medical Colleges In Telangana: సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్‌కర్నూల్, రామగుండంలో ఎనిమిది కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ కోర్సు మొదటి సంవత్సరం తరగతులు ఈ రోజు నుండి ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం 12 గంటలకు ప్రగతి భవన్ నుంచి వర్చువల్‌గా తరగతులను కేసీఆర్ ప్రారంభిస్తారు.
రాష్ట్రంలో ఈ రోజు ఒకే సారి 8 మెడికల్ కాలేజీల్లో తరగతులను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆయన ప్రారంభిస్తారు.
సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్‌కర్నూల్, రామగుండంలో ఎనిమిది కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ కోర్సు మొదటి సంవత్సరం తరగతులు ఈ రోజు నుండి ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం 12 గంటలకు ప్రగతి భవన్ నుంచి వర్చువల్‌గా తరగతులను కేసీఆర్ ప్రారంభిస్తారు.
రూ. 4,080 కోట్లతో స్థాపించిన ఈ 8 కొత్త మెడికల్ కాలేజీల వల్ల తెలంగాణలో 1,150 అదనపు MBBS సీట్లు విద్యార్థులకు లభించనున్నాయి. ఈ కాలేజీల్లో అడ్మిషన్లు ఇటీవలే పూర్తయ్యాయి.
తెలంగాణలో 2014 వరకు మూడు ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే ఉన్నాయి.అయితే, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం మొత్తం వైద్య కళాశాలల సంఖ్యను 17కు పెంచింది. ప్రతి జిల్లాలో ఒక వైద్య కళాశాల ఉండేలా చూడడం ద్వారా మొత్తం ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్యను 33కి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
గత ఎనిమిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఒక్క ప్రభుత్వ వైద్య కళాశాలను కూడా మంజూరు చేయనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తన స్వంత నిధులతో ఈ కళాశాలలను స్థాపించింది. జిల్లా ఆసుపత్రులను అప్‌గ్రేడ్ చేసి కొత్త మెడికల్ కాలేజీలకు అనుసంధానం చేసింది.