నేటినుంచి పోడు పట్టాల పంపిణీ.. ఆసిఫాబాద్ కు కేసీఆర్

సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈరోజు పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమం మొదలవుతుంది. ఆసిఫాబాద్ లో సీఎం చేతుల మీదుగా లబ్ధిదారులు పోడు పట్టాలు అందుకుంటారు.

Advertisement
Update:2023-06-30 06:32 IST

పోడు పట్టాల పంపిణీ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ నేడు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు వెళ్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో ఆయన పాల్గొంటారు. ఆసిఫా బాద్ లో కొమరం భీం విగ్రహావిష్కరణ చేస్తారు. సీఎం రాక కోసం కొమరం భీం జిల్లా వాసులు ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా జిల్లా కేంద్రంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు.

షెడ్యూల్..

మధ్యాహ్నం 12 గంటలకు సిద్ధిపేట అగ్రికల్చర్ ఫామ్ నుండి హెలికాప్టర్ లో పయనం

మధ్యాహ్నం 12.25 గంటలకు ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ కు హెలికాప్టర్ చేరిక

1.15 గంటలకు కొమరం భీం చౌరాస్తాలో విగ్రహావిష్కరణ, నివాళి

1.25 గంటలకు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం

1.50 గంటలకు చిల్డ్రన్ పార్క్ లో కొట్నాక్ భీంరావ్ విగ్రహావిష్కరణ..

2.10 గంటలకు జిల్లా పోలీస్‌ కార్యాలయ ప్రారంభోత్సవం

2.30 గంటలకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ ప్రారంభోత్సవం.

పోడు పట్టాల పంపిణీ..

ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ బిల్డింగ్ ప్రారంభోత్సవం అనంతరం సీఎం కేసీఆర్ అక్కడే ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. జిల్లాలోని లబ్ధిదారులకు పోడుపట్టాలు అందజేస్తారు. మధ్యాహ్న భోజనం అనంతరం 4 గంటలకు బహిరంగ సభ ఉంటుంది. సాయంత్రం 5.05 గంటలకు హెలికాప్టర్‌ లో తిరుగు ప్రయాణమవుతారు కేసీఆర్. 6.15 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడినుంచి రోడ్డు మార్గం ద్వారా ప్రగతి భవన్‌ కు వెళ్తారు. 

Tags:    
Advertisement

Similar News