ఒకప్పుడు కాగజ్ నగర్ మినీ ఇండియా..

గ‌తంలో వ్య‌వ‌సాయం చేసుకునే కుటుంబాల‌కు, రైతుల‌కు ఎవ్వ‌రూ పిల్ల‌ను ఇచ్చేవారు కాదని, ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేదని తెలిపారు సీఎం కేసీఆర్. వ్య‌వ‌సాయం చేస్తున్నారా..? భూమి ఉందా? అని అడిగి మరీ ఇప్పుడు పిల్ల‌ను ఇస్తున్నార‌ని చెప్పారు.

Advertisement
Update:2023-11-08 15:28 IST

కాగ‌జ్‌ న‌గ‌ర్ నియోజకవర్గం ఒక‌ప్పుడు మినీ ఇండియాలాగా ఉండేదని, అన్ని రాష్ట్రాల వారు ఇక్క‌డ‌కు ప‌నికి వ‌చ్చేవారని, తిరిగి ఆ వైభవం రావాలని, మిగిలిన ఖార్ఖానాలు కూడా తెరిపించి పునర్వైభవం తెస్తామని చెప్పారు సీఎం కేసీఆర్. ఎమ్మెల్యే కోనేరు కోన‌ప్ప ఆధ్వ‌ర్యంలోనే ప‌రిశ్ర‌మ‌లు వ‌చ్చే విధంగా చ‌ర్య‌లు తీసుకుంటామన్నారు. సిర్పూర్ కాగజ్ నగర్ లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు కేసీఆర్.


Full View

అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో కాగ‌జ్‌ న‌గ‌ర్ మొదటి స్థానంలో ఉంటుందని, రాష్ట్ర ఎమ్మెల్యేల సంఖ్య ఇక్క‌డి నుంచే ప్రారంభం అవుతుందని, రేపు బీఆర్ఎస్ గెలిచే ఎమ్మెల్యేల లిస్ట్ లో కూడా కోన‌ప్పది నెంబర్-1 స్థానమేనని చెప్పారు సీఎం కేసీఆర్. కోన‌ప్ప లాంటి మంచి ఎమ్మెల్యే పేప‌ర్ మిల్లు తెరిపించేందుకు ఎంతో క‌ష్ట‌ప‌డ్డారని, ఎంతో బాధ‌ప‌డ్డారని గుర్తు చేశారు. కోనేరు కోన‌ప్ప‌కు తాను ఎమ్మెల్యే అనే గ‌ర్వం లేదని.. గ్రామాల్లో తిరుగుతూ ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మైపోతార‌ని ప్ర‌శంసించారు. అలాంటి ఎమ్మెల్యేను పొగోట్టుకోవ‌ద్దని, భారీ మెజార్టీతో గెలిపించుకోవాల‌ని నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు.

గ‌తంలో వ్య‌వ‌సాయం చేసుకునే కుటుంబాల‌కు, రైతుల‌కు ఎవ్వ‌రూ పిల్ల‌ను ఇచ్చేవారు కాదని, ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేదని తెలిపారు సీఎం కేసీఆర్. వ్య‌వ‌సాయం చేస్తున్నారా..? భూమి ఉందా? అని అడిగి మరీ ఇప్పుడు పిల్ల‌ను ఇస్తున్నార‌ని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్ప‌డ‌క ముందు కాగ‌జ్‌ న‌గ‌ర్ ఎలా ఉండేదో అందరికీ తెలుసన్నారు. రైతుల ఆత్మ‌హ‌త్య‌లు, ఆక‌లి చావులు, ప‌రిశ్ర‌మ‌లు మూత‌ప‌డ‌టం వంటి ర‌క‌ర‌కాల ఇబ్బందుల్ని చూశామన్నారు. పొట్ట చేత‌ప‌ట్టుకుని వ‌ల‌స‌లు పోయారని, ఈ పదేళ్లలో ఒక్కొక్కటీ బాగు చేసుకుంటూ ముందుకు పోతున్నామన్నారు. విద్యా, వైద్య వ్యవస్థను బాగు చేసుకున్నామని చెప్పారు. కాంగ్రెస్ వస్తే మళ్లీ అంధకారమేనని చెప్పారు కేసీఆర్.

 

Tags:    
Advertisement

Similar News