పిచ్చి కుక్కలు మస్తుగా మొరుగుతాయి.. పట్టించుకుంటామా..?

తిట్టాలంటే ఈ దేశంలో తిట్లకు క‌రువు లేదని, మనకూ తిట్టడం వచ్చని, ఈరోజు మొద‌లుపెడితే రేప‌టి దాకా తిట్టొచ్చని అంటూనే.. కాంగ్రెస్ నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కేసీఆర్.

Advertisement
Update:2023-11-18 17:47 IST

జనగామ నియోజకవర్గం చేర్యాలలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కాంగ్రెస్ నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సీఎం కేసీఆర్. ఇటీవల కాలంలో ఆయన ఘాటుగా మాట్లాడిన సభ ఇదే కావడం విశేషం. "ఎవ‌డో జ‌న‌గాం వ‌చ్చి వ‌ర్లిపోయిండ‌ట. కుక్కలు మ‌స్తు మొరుగుతాయి. దాన్ని లెక్క పెడతమా..? జ‌న‌గాంలో మొరిగిపోయిన కుక్క ఏం చేసిందో తెలుసా. రైఫిల్ ప‌ట్టుకుని ఎవ‌డ్రా తెలంగాణ ఉద్య‌మం చేసేద‌ని క‌రీంన‌గ‌ర్ మీద‌కు పోయింది. ఆ రోజు నుంచి ప్ర‌జ‌లు రైఫిల్ రెడ్డి అని పేరు పెట్టిండ్రు. వీళ్లు వ‌చ్చి మాట్లాడతాం అంటే క‌నీసం సిగ్గుండాలి. ఆంధ్రోళ్ల బూట్లు మోసుకుంటూ ఉండి, ఆ రోజు చంద్ర‌బాబుకు చెంచాగిరి చేసుకుంటూ ఉండి." అంటూ ఓ రేంజ్ లో ఫైరయ్యారు సీఎం కేసీఆర్.


Full View

జనగామలో ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని కాదని, పల్లా రాజేశ్వర్ రెడ్డికి సీఎం కేసీఆర్ టికెట్ ఇచ్చారు. అసంతృప్తి లేకుండా రాజీ చేశారు, అభ్యర్థి మార్పు అనేది ఫలితంపై ప్రభావం చూపకుండా ఉండేందుకు ఈ నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు కేసీఆర్. ఈరోజు కేవలం చేర్యాల సభకోసమే కేటాయించారు కేసీఆర్. కాంగ్రెస్ నేతలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తిట్టాలంటే ఈ దేశంలో తిట్లకు క‌రువు లేదని, మనకూ తిట్టడం వచ్చని, ఈరోజు మొద‌లుపెడితే రేప‌టి దాకా తిట్టొచ్చని అంటూనే.. కాంగ్రెస్ నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కేసీఆర్.

ఉన్న తెలంగాణను ముంచిందే కాంగ్రెస్‌ అని అన్నారు కేసీఆర్. బీఆర్‌ఎస్‌ ను చీల్చాలనే ప్రయత్నం కూడా చేసిందని విమర్శించారు. కేసీఆర్ కే పిండం పెడతామని కొంతమంది అంటున్నారని, ఎవరికి పిండం పెట్టాలో ఓటర్లకు బాగా తెలుసన్నారు. తెలంగాణ కోసం కొట్లాడింది ఎవ‌రు..? ఉద్య‌మం మొద‌లుపెట్టింది ఎవ‌రు..? ప్రాణాలకు తెగించి, పేగులు తెగేదాకా జై తెలంగాణ అని నిన‌దించి తెలంగాణ సాధించినోడు ఎవ‌రు?సాధించిన తెలంగాణ‌ను దేశంలో నెంబర్-1 చేసింది ఎవ‌రు? 24 గంట‌ల క‌రెంట్ తెచ్చినోడు ఎవ‌రు..? ప్ర‌తి ఇంటికి మంచినీరు తెచ్చినోడు ఎవ‌రు..? పంట‌ల‌కు సాగునీరు తెచ్చినోడు ఎవ‌రు..? అని సూటిగా ప్రశ్నించారు కేసీఆర్. 

Tags:    
Advertisement

Similar News