నలుగురు తలమాసినోళ్లు పోతే నష్టం లేదు..

తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ చీకటి రాజ్యం కావాలా అని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. రైతుబంధు పేరిట నిధులు దుబారా చేస్తున్నా మని కాంగ్రెస్‌ నేతలు దుర్మార్గంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

Advertisement
Update:2023-11-09 08:44 IST

డబ్బు కట్టలతో వచ్చే కాంగ్రెస్‌ నేతలను నమ్మొద్దని బెల్లంపల్లి వాసులకు సూచించారు సీఎం కేసీఆర్. చెన్నూరులో చెల్లని రూపాయి.. బెల్లంపల్లిలో చెల్లుతుందా? అని ప్రశ్నించారు. బెల్లంపల్లి ప్రజలు తెలివైన వారని, నిత్యం ప్రజల్లో ఉండే చిన్నయ్యను గెలిపించాలని కోరారు. నలుగురు తలమాసినోళ్లు అమ్ముడు పోయినంత మాత్రాన మనకేమీ ఫరక్‌ పడదని అన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి తెలంగాణ ప్రజలే బాసులని స్పష్టంచేశారు కేసీఆర్. బెల్లంపల్లి ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు.


Full View

దుర్గం చిన్నయ్య చాలా మంచి వ్యక్తి అని, ఆయన వెనకున్న పార్టీని చూసి బెల్లంపల్లి ప్రజలు ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు కేసీఆర్. చిన్నయ్య అడిగిన ఇంజినీరింగ్‌ కాలేజీ, గురుకులాలు ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. బెల్లంపల్లిలో 10 వేలమందికి ఇళ్ల పట్టాలిచ్చామని, మిగిలినవారికి కూడా ఇస్తామని చెప్పారు.

చీకటి రాజ్యం కావాలి..

తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ చీకటి రాజ్యం కావాలా అని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. రైతుబంధు పేరిట నిధులు దుబారా చేస్తున్నా మని కాంగ్రెస్‌ నేతలు దుర్మార్గంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రైతుబంధు దుబారానా? అని ప్రజల్ని ప్రశ్నించారు. వ్యవసాయానికి 3 గంటల కరెంటు చాలు అని పీసీసీ అధ్యక్షుడే స్వయంగా చెబుతున్నారని, ఆ పార్టీ అధికారంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలన్నారు. కాంగ్రెస్‌ ఎప్పుడూ కరెంటు ఇవ్వలేదని, తాము ఇస్తుంటే అడ్డంపడుతోందని విమర్శించారు. కాంగ్రెస్‌ కు ఓటేస్తే మళ్లీ దళారుల రాజ్యం వస్తుందని హెచ్చరించారు.

Tags:    
Advertisement

Similar News