నూతన సచివాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్, పోడు భూముల పంపిణీపై తొలి సంతకం

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సచివాలయాన్ని కొద్ది సేపటి క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ముందుగా ఆయన యాగ‌శాల‌లో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం నూతన సచివాలయాన్ని ప్రారంభించారు.

Advertisement
Update:2023-04-30 13:53 IST

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సచివాలయాన్ని కొద్ది సేపటి క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ముందుగా ఆయన యాగ‌శాల‌లో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం నూతన సచివాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సభాపతి, మండలి ఛైర్మన్‌, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, సీఎస్‌, డీజీపీ, వివిధ శాఖల ఉన్నతాధికారులు కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఆ తర్వాత కేసీఆర్ ఆరవ ఫ్లోర్ లో ఉన్న తన కార్యాలయంలో కుర్చీలో ఆసీనులయ్యారు. అనంతరం ఆదివాసులకు పోడు భూములు పంపిణీ చేసే ఫైల్ పై తొలి సంతకం చేశారు.

ఇక మంత్రులు కూడా తమ తమ కార్యాలయాల్లో చార్జ్ తీసుకుంటున్నారు. అనంతరం మంత్రులందరూ ఈ రోజు తొలిసంతకాలు చేయనున్న ఫైళ్ళు:

♦ కేటీఆర్ – పేదలకు డబుల్ బెడ్రూంల కేటాయింపు

హరీష్ రావు – సీతారామ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఫైల్

తలసాని శ్రీనివాస్ యాదవ్ – ఉచిత చేప పిల్లల పంపిణీ, గొర్రెల పంపిణీ

నిరంజన్ రెడ్డి – 18 చెక్ డ్యాంలకు అనుమతి

కొప్పుల ఈశ్వర్ – దళిత బంధు రెండో విడత ఫైల్

ఇంద్రకరణ్ రెడ్డి – జీహెచ్ఎంసీ పరిధిలోని దేవాలయాల్లో దూపదీప నైవేద్యం ప్రారంభం.

మహమూద్ అలి – కొత్త పోలీస్ స్టేషన్ల మంజూరు

మల్లారెడ్డి – శ్రమ శక్తి అవార్డులు

దయాకర్ రావు – ఐకేపీ గ్రూపులకు మండలాల వారీగా కొత్త భవనాలు

గంగుల కమలాకర్ – అంగన్వాడీ కేంద్రాలకు సన్నబియ్యం సరఫరా

వేముల ప్రశాంత్ రెడ్డి – రోడ్లు భవనాల శాఖ పునర్వ్యవస్థీకరణ ఫైల్ పై తొలి సంతకం చేయనున్నారు.

Tags:    
Advertisement

Similar News