సీఎం కేసీఆర్ ఆస్తులివే..!
ఎర్రవెల్లిలో 53 ఎకరాల వ్యవసాయ భూమి, 7 ట్రాక్టర్లు, హర్వెస్టర్లు, గూడ్స్ హాలర్ సహా 14 వాహనాలు ఉన్నాయని అందులో పేర్కొన్నారు. అఫిడవిట్‌లో పేర్కొన్న ప్రకారం కేసీఆర్‌కు సొంతంగా కారు కూడా లేదు.
బీఆర్ఎస్ పార్టీ సింబల్ అనగానే కారు అని టక్కున చెప్పేస్తాం. కానీ, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌కు సొంతంగా కారు కూడా లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా గజ్వేల్, కామారెడ్డి స్థానాలకు నామినేషన్ దాఖలు చేశారు గులాబీ బాస్. అఫిడవిట్‌లో తాను రైతుగా చెప్పుకున్న కేసీఆర్.. ఎర్రవెల్లిలో 53 ఎకరాల వ్యవసాయ భూమి, 7 ట్రాక్టర్లు, హర్వెస్టర్లు, గూడ్స్ హాలర్ సహా 14 వాహనాలు ఉన్నాయని అందులో పేర్కొన్నారు. అఫిడవిట్‌లో పేర్కొన్న ప్రకారం కేసీఆర్‌కు సొంతంగా కారు కూడా లేదు.
వ్యవసాయం ఆధారంగా గడిచిన ఏడాది కోటి 40 లక్షల ఆదాయం వచ్చినట్లు కేసీఆర్ పేర్కొన్నారు. 2018లో రూ.23 కోట్లుగా ఉన్న కేసీఆర్ ఆస్తులు.. ప్రస్తుతం రూ.59 కోట్లకు పెరిగాయి. ఇందులో బంజారాహిల్స్, ఎర్రవెల్లి, కరీంనగర్‌లోని మూడు ఇళ్లు కూడా ఉన్నాయి. వీటి విలువ 23 కోట్ల 50 లక్షలు. ఇక తనకు రూ.24 కోట్ల అప్పులు ఉన్నాయని పేర్కొన్నారు.
ప్రస్తుతానికి చేతిలో రూ.4 లక్షలు, భార్య శోభకు రూ.కోటిన్నర విలువైన బంగారు అభరణాలు ఉన్నాయని అఫిడవిట్‌లో స్పష్టం చేశారు కేసీఆర్. 2018 ఎన్నికల సమయంలో తనపై 63 కేసులున్నాయని, తాజా అఫిడవిట్‌లో 9 కేసులు మాత్రమే ఉన్నాయని స్ఫష్టం చేశారు. ఈ కేసులన్ని రాష్ట్ర ఉద్యమ సమయంలోనివే. సీఎం కేసీఆర్‌కు సొంతంగా ఎలాంటి సోషల్‌మీడియా అకౌంట్స్ లేవు. ఆయన ఈ-మెయిల్‌ను సైతం పీఏ పరమేశ్వర రెడ్డి పర్యవేక్షిస్తారు.