కాంగ్రెస్‌ను పూర్తిగా సైడ్ చేసిన కేసీఆర్

ఈ రోజు మునుగోడులో జరిగిన సభలో కేసీఆర్ పూర్తిగా బీజేపీ, మోడీ, అమిత్ షాలను మాత్రమే టార్గెట్ చేశారు. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడానికి పోటీ చేస్తున్న కాంగ్రెస్‌పై మాత్రం రెండు మాటలు మాట్లాడి సైడ్ చేశారు.

Advertisement
Update:2022-08-20 19:15 IST

మునుగోడు ఉపఎన్నిక రాబోతుండగా అధికార టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన 'ప్రజా దీవెన' సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ, నరేంద్ర మోడీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మోడీ ప్రభుత్వం తెలంగాణ‌ను పూర్తిగా వదిలేసిందని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం లేకపోతే ఇక్కడ బావి దగ్గర మోటార్లకు మీట‌ర్లు పెట్టడానికి బీజేపీ రెడీగా ఉందన్నారు. నల్లగొండ‌ జిల్లాలో గ‌తంలో ఫ్లోరైడ్ బాధితులు ఉండేవారు. వారి బాధలను నేనే స్వయంగా చూశాను. అప్పుడే ఈ జిల్లాకు మంచినీరు అందించాలని అనుకున్నానని సీఎం కేసీఆర్ చెప్పారు.

నల్లగొండ జిల్లాతో పాటు మునుగోడులో ఫ్లోరైడ్ నీళ్ల‌తో వ్యాధుల బారిన పడిన వారు.. ఇవాళ టీఆర్ఎస్‌ ప్ర‌భుత్వం చేపట్టిన మిషన్ భగీరథ కారణంగా మంచినీరు తాగుతున్నారని చెప్పారు. రేపు మునుగోడులో ఓటేసే ముందు అందరూ కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలని కేసీఆర్ సూచించారు. బీజేపీ అనేది ఓ టక్కుటమార పార్టీ అనీ.. కాంగ్రెస్‌కు ఓటేస్తే వృథా అని కేసీఆర్ అన్నారు. మునుగోడు ప్రజలు, రైతులు, ఓటు వేసే ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులను గుర్తు చేసుకోవాల‌ని కోరారు. బావుల దగ్గర మోటార్లకు ముందు దండం పెట్టి ఓటేయాలంటూ.. కాంగ్రెస్ పార్టీని పరోక్షంగా విమర్శించారు.

ఈ రోజు మునుగోడులో జరిగిన సభలో కేసీఆర్ పూర్తిగా బీజేపీ, మోడీ, అమిత్ షాలను మాత్రమే టార్గెట్ చేశారు. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడానికి పోటీ చేస్తున్న కాంగ్రెస్‌పై మాత్రం రెండు మాటలు మాట్లాడి సైడ్ చేశారు. దీంతో ఈ బై పోల్ కేవలం టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య మాత్రమే ఉంటుందని సంకేతాలు పంపారు.

Tags:    
Advertisement

Similar News