వేములవాడలో పలు అభివృద్ధి పనులకు సీఎం భూమి పూజ
వేములవాడలో రూ. 127.65 కోట్లతో అభివృద్ధి పనులను చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం
సీఎం రేవంత్‌రెడ్డి వేములవాడలో పర్యటిస్తున్నారు. దీనిలో భాగంగా ఆయన రాజరాజేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనాలిచ్చి తీర్థప్రసాదాలు అందజేశారు. వేములవాడలో రూ. 127.65 కోట్లతో అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నది. ఈ క్రమంలో ఆలయ సమీపంలో పలు అభివృద్ధి పనులకు సీఎం భూమి పూజ చేశారు. అనంతరం గుడి చెరువులో ఏర్పాటు చేసిన సభలో పాల్గొననున్నారు. గల్ఫ్ మృతుల కుటుంబాలకు పరిహారం పంపిణీ చేయనున్నారు. నేతన్నల కోసం రూ. 50 కోట్లతో నూలు బ్యాంకును సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.