రెండేళ్లలో చిన్న కాళేశ్వరం పూర్తి
45 వేలకు ఎకరాలకు నీళ్లివ్వాలని మంత్రుల ఆదేశం
Advertisement
మంథని అసెంబ్లీ నియోజకవర్గంలోని 45 వేల ఎకరాలకు నీళ్లిచ్చే చిన్న కాళేశ్వరం (ముక్తీశ్వర) లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలని మంత్రులు ఆదేశించారు. శనివారం జలసౌధలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు ఈ ప్రాజెక్టుపై రివ్యూ చేశారు. కన్నెపల్లిలోని మొదటి, కాటారంలోని రెండో పంప్ హౌస్ ల పనులతో పాటు ఆయకట్టుకు నీళ్లిచ్చే కాల్వలు, ఇతర పనుల వివరాలను అధికారులను అడిగి మంత్రులు తెలుసుకున్నారు. ఎస్సారెస్పీ నీటితో మంథని నియోజకవర్గంలో 28 వేల ఎకరాలకు సాగునీరు అందేదని, కాల్వల్లో పూడిక పేరుకుపోవడం, ఇతర కారణాలతో ఆయకట్టుకు నీళ్లు అందడం మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. గుండారం చెరువు నుంచి మైనర్లు, సబ్ మైనర్లకు అవసరమైన రిపేర్లు చేపట్టాలని ఆదేశించారు.
Advertisement