ఎయిర్‌పోర్టు మెట్రో, ఫార్మాసిటీపై రేవంత్ సంచలనం..!
శంషాబాద్‌కు వెళ్లే మెట్రో దూరాన్ని తగ్గిస్తామన్నారు రేవంత్ రెడ్డి. భెల్ నుంచి ఎయిర్‌పోర్టు 32 కిలోమీటర్ల దూరం ఉంటుందని, MGBS నుంచి పాతబస్తీ మీదుగా ఎయిర్‌పోర్టుకు మెట్రో నిర్మిస్తామన్నారు.
ఎయిర్‌పోర్టు మెట్రో, ఫార్మా సిటీ రద్దు అంటూ జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎయిర్‌పోర్టు మెట్రో, ఫార్మాసిటీని రద్దు చేయడం లేదని చెప్పారు. ఎయిర్‌పోర్టు మెట్రోను మరో మార్గంలో నిర్మిస్తామని చెప్పారు. మీడియాతో చిట్‌చాట్ చేసిన రేవంత్ రెడ్డి.. పలు అంశాలపై మాట్లాడారు.
శంషాబాద్‌కు వెళ్లే మెట్రో దూరాన్ని తగ్గిస్తామన్నారు రేవంత్ రెడ్డి. భెల్ నుంచి ఎయిర్‌పోర్టు 32 కిలోమీటర్ల దూరం ఉంటుందని, MGBS నుంచి పాతబస్తీ మీదుగా ఎయిర్‌పోర్టుకు మెట్రో నిర్మిస్తామన్నారు. గచ్చిబౌలి నుంచి మెట్రోలో ఎయిర్‌పోర్టుకు వెళ్లేవారు దాదాపు ఉండరన్నారు రేవంత్ రెడ్డి. మైండ్ స్పేస్ వరకు ఉన్న మెట్రోను ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు పొడిగిస్తామన్నారు. అవసరమైతే మియాపూర్ నుంచి రామచంద్రపూర్ వరకు పొడిగిస్తామన్నారు. ప్రస్తుతం తాము ప్రతిపాదిస్తున్న ఎయిర్‌పోర్టు మెట్రో లైన్.. గత ప్రభుత్వం ప్రతిపాదించిన దానికంటే తక్కువ ఖర్చులో పూర్తవుతుందన్నారు రేవంత్ రెడ్డి.
ఇక ఫార్మా సిటీ విషయంపైనా స్పందించారు సీఎం. ఫార్మాసిటీ, ORR మధ్య ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటు చేస్తామన్నారు. జీరో కాలుష్యంతో ప్రత్యేక క్లస్టర్లు ఉంటాయన్నారు. ప్రత్యేక క్లస్టర్ల దగ్గరే ఆయా పరిశ్రమల్లో పని చేసే వారికి ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కార్మికులు హైదరాబాద్ రాకుండా క్లస్టర్లలో అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు.