కేసీఆర్ ప్రతి ఆలోచన వెనుక మానవీయకోణం -హరీష్ రావు

ఈ స్కీమ్‌ తో ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్ అవుట్స్ తగ్గుతాయని వివరించారు. అంతే కాదు, బ్రేక్ ఫాస్ట్ పథకం విద్యార్థులను ఆరోగ్యంగా ఉండేలా చేస్తుందని చెప్పారు హరీష్ రావు.

Advertisement
Update:2023-10-06 10:24 IST

సీఎం కేసీఆర్ ఏ కార్యక్రమం చేపట్టినా దాని వెనుక మానవీయ కోణం ఉంటుందని అన్నారు మంత్రి హరీష్ రావు. మహేశ్వరం మండలం రావిర్యాలలోని జడ్పీ హై స్కూల్‌ లో సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌ ప్రారంభోత్సవంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలసి పాల్గొన్నారాయన. సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం పేద పిల్లలకు వరమని చెప్పారు. ఈ స్కీమ్‌ తో ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్ అవుట్స్ తగ్గుతాయని వివరించారు. అంతే కాదు, బ్రేక్ ఫాస్ట్ పథకం విద్యార్థులను ఆరోగ్యంగా ఉండేలా చేస్తుందని చెప్పారు హరీష్ రావు.

రాష్ట్రంలోని ఒక్కో నియోజకవర్గంలోని ఒక్కో ప్రభుత్వ పాఠశాలలో ఈ పథకాన్ని ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించారు. వాస్తవానికి సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం ఇచ్చినా కూడా చివరి నిమిషంలో ఆయన పర్యటన రద్దయింది. మంత్రి హరీష్ రావు లాంఛనంగా ఈ బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించారు.

డ్రాపవుట్స్ లేకుండా చేయడం, ఉదయాన్నే కూలి పనులకు, ఇతర పనులకు వెళ్లే తల్లిదండ్రులపై భారం తగ్గించడం, విద్యార్థులను పౌష్టికాహారాన్ని అందించడం.. అనే లక్ష్యాలతో ఈ పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 27,147 సర్కార్‌ బడుల్లో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం బ్రేక్‌ఫాస్ట్‌ అందిస్తోంది. తరగతులు ప్రారంభమయ్యే సమయానికి అరగంట ముందు విద్యార్థులకు అల్పాహారం అందిస్తారు. నిర్ణయించిన మెనూ ప్రకారం ప్రతి రోజూ టిఫిన్ సిద్ధం చేస్తారు. మిగిలిన పాఠశాలల్లో దసరా సెలవలు పూర్తయిన వెంటనే ఈ కార్యక్రమం మొదలవుతుంది. 

Tags:    
Advertisement

Similar News