పక్కాగా, పారదర్శకంగా.. చేనేత మిత్ర

లబ్ధిదారులందరి ఫోన్ నెంబర్లు కూడా అందుబాటులో ఉంచారు. ఏ ఒక్క లబ్ధిదారుడికి ఫోన్ చేసినా వారి వివరాలు, వారి ఆర్థిక పరిస్థితి తెలుసుకునే అవకాశముంది. జియో ట్యాగింగ్ ద్వారా అసలు మగ్గం ఉందో లేదో కూడా తేలిపోతుంది. అంటే పథకం ఎక్కడా పక్కదారి పట్టలేదనే ధీమా ప్రభుత్వంలో ఉంది.

Advertisement
Update:2023-09-02 19:24 IST

పథకాల అమలులోనే కాదు, పారదర్శకతలో కూడా ఆదర్శంగా నిలుస్తోంది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల చేనేత మిత్ర అందరికీ ఆందుబాటులోకి వచ్చింది. నియోజకవర్గానికి సగటున 270 కుటుంబాలకు లబ్ధి చేకూర్చేలా మొత్తం 32వేల కుటుంబాలకు చేనేత మిత్ర ద్వారా ఆర్థిక ప్రయోజనం అందించింది ప్రభుత్వం. అయితే లబ్ధిదారులకు సంబంధించి మగ్గాలను జియో ట్యాగింగ్ చేస్తూ ఈ పథకాన్ని పక్కాగా అమలు చేశారు. లబ్ధిదారులందరి ఫోన్ నెంబర్లు కూడా అందుబాటులో ఉంచారు. ఏ ఒక్క లబ్ధిదారుడికి ఫోన్ చేసినా వారి వివరాలు, వారి ఆర్థిక పరిస్థితి తెలుసుకునే అవకాశముంది. జియో ట్యాగింగ్ ద్వారా అసలు మగ్గం ఉందో లేదో కూడా తేలిపోతుంది. అంటే పథకం ఎక్కడా పక్కదారి పట్టలేదనే ధీమా ప్రభుత్వంలో ఉంది.

విమర్శలకు సమాధానం..

ఇటీవల తెలంగాణలో దళిత బంధు పథకంపై కూడా విమర్శలు వినిపించాయి, ఈరోజు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో కూడా అక్కడక్కడా అసంతృప్త స్వరాలు వినిపించాయి. అయితే ఇవన్నీ రాజకీయ ప్రేరేపితమైనవేనంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం న్యాయం చేస్తోందని, దీనికి తాజా ఉదాహరణ చేనేత మిత్ర అమలు అని అంటున్నారు. లబ్ధిదారుల లిస్ట్ కూడా అందరికీ అందుబాటులో ఉంచి పాదర్శకతను పెంచింది తెలంగాణ ప్రభుత్వం.

ఇతర రాష్ట్రాలకంటే ఎక్కువ లబ్ధి..

తెలంగాణలో అమలవుతున్న ఏ పథకం అయినా ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే భిన్నంగా, మిన్నగా కనిపించడం సహజం. చేనేతలకు పొరుగు రాష్ట్రం ఏపీలో కూడా ఆర్థిక సాయం అందుతోంది. అయితే వారికి ఏడాదికి ఇచ్చే మొత్తం 24వేల రూపాయలు. తెలంగాణలో ఒక్కో కుటుంబానికి అందుతున్న సాయం అక్షరాలా ఏడాదికి 36వేల రూపాయలు. చేనేతలకు ప్రత్యేక బీమా సౌకర్యం, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తెలంగాణలో అందుబాటులో ఉంది. 

Tags:    
Advertisement

Similar News