జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీలో చిరుత కలకలం

రాజేంద్ర నగర్ జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీలో చిరుత కలకలం రేపింది.

Advertisement
Update:2025-01-12 10:45 IST

రాజేంద్ర నగర్‌లో మరోసారి చిరుత కలకలం రేపింది. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీలో చిరత ఉదయం వాకర్స్ కంటపడింది ఇక భయాందోళనతో పరుగులు తీశారు వాకర్స్. అయితే… వాకర్స్ ను గమనించి చెట్ల పొదల్లోకి వెళ్ళింది చిరుత.దీంతో రంగంలోకి దిగిన అటవీ అధికారులు.. చిరుత జాడ కోసం వెతుకుతున్నారు.

చిరుత పాదాలు గుర్తించిన మార్నింగ్ వాకర్స్, భయబ్రాంతులకు గురి అవుతున్నారు విద్యార్థులు. రాజేంద్ర నగర్ జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీలో చిరుత కలకలం సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఫారెస్ట్ ఆఫీసర్‌లు బోన్లు ఏర్పాటు చేసి చాకచక్యంగా చిరుత‌ను బంధించారు. అయితే, చిరుత పులి శంషాబాద్, గ‌గ‌న్‌ప‌హాడ్‌లోని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో ఉండి హిమాయత్‌సాగర్, శంషాబాద్, రాజేంద్రనగర్, మొయినాబాద్‌లోని గ్రామాల చుట్టూ సంచ‌రిస్తున్నట్లుగా అటవీ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News