రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడు.. చిరు ప్రకటన

రామ్ చరణ్ ఉపాసన తొలి సంతానాన్ని పొందబోతున్నారంటూ ట్వీట్ చేశారు చిరు. ఉపాసన తల్లిదండ్రుల పేర్లు కూడా ఆ ట్వీట్ లో మెన్షన్ చేశారు.

Advertisement
Update:2022-12-12 15:30 IST

ఆ హనుమంతుడి దీవెనలతో రామ్ చరణ్, ఉపాసన దంపతులకు తొలి సంతానం కలగబోతోంది అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిరంజీవి ట్వీట్ కి రామ్ చరణ్ కూడా స్పందించారు. మెగా అభిమానులు చాలా కాలంగా ఈ వార్త కోసమే ఎదురుచూస్తున్నారు.



2012 జూన్ 14న రామ్ చరణ్ ఉపాసన వివాహం జరిగింది. రామ్ చరణ్ తో పాటు ఇండస్ట్రీ లో ఉన్న యువ హీరోలు ఇప్పటికే తండ్రులయ్యారు. కానీ రామ్ చరణ్ విషయంలో ఆ గుడ్ న్యూస్ ఇంకా చెప్పలేదని అభిమానులు చాలాకాలంగా సోషల్ మీడియా ద్వారా అడుగుతూనే ఉన్నారు. ఎట్టకేలకు చిరంజీవి సోషల్ మీడియా ద్వారా ప్రకటన చేసి తన సంతోషాన్ని షేర్ చేసుకున్నారు. రామ్ చరణ్ ఉపాసన తొలి సంతానాన్ని పొందబోతున్నారంటూ ట్వీట్ చేశారు చిరు. ఉపాసన తల్లిదండ్రుల పేర్లు కూడా ఆ ట్వీట్ లో మెన్షన్ చేశారు.

గతంలో ఒక ఇంటర్వ్యూలో ఉపాసన తమకు పిల్లలు వద్దు అన్నట్టుగా మాట్లాడినట్టు ఓ వార్త హల్చల్ చేసింది అప్పట్లో ఉపాసన ఈ విషయంలో మళ్లీ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. తాగాగా చిరంజీవి ప్రకటనతో మెగా అభిమానుల్లో సంతోషం నెలకొంది. కుమార్తెల పిల్లల ద్వారా చిరంజీవి గతంలోనే తాత అయినా, ఇప్పుడు మరోసారి రామ్ చరణ్ ద్వారా తాత కాబోతున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చిరంజీవి ఫ్యామిలీకి చెందిన ఈ వార్త ట్రేండింగ్ లో నిలిచింది.

Tags:    
Advertisement

Similar News