చంద్రబాబు శుభాకాంక్షలు.. తెలంగాణ అనే పేరే లేదు

చంద్రబాబు సందేశంలో ఎక్కడా తెలంగాణ అనే పదం లేదు, తెలంగాణ ఆవిర్భావం అనే ప్రస్తావన లేదు.

Advertisement
Update:2024-06-02 16:59 IST

జూన్-2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు చాలామంది నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. కొంతమంది జై తెలంగాణ అన్నారు, మరికొందరు ఆ నినాదం లేకుండానే శుభాకాంక్షలు తెలిపారు. కానీ వీటన్నిటిలో చంద్రబాబు మెసేజ్ మాత్రం వింత, విడ్డూరం అనే చెప్పాలి. కనీసం తెలంగాణ అనే పదమే లేకుండా ఆయన వెరైటీగా తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

చంద్రబాబు సందేశం ఇదే..

"రెండు రాష్ట్రాలు ఏర్పడి నేటికి 10 ఏళ్లు. రాష్ట్రాలు రెండైనా తెలుగు ప్రజలంతా ఒక్కటే. 10 కోట్ల తెలుగు జాతి మేటిగా వెలగాలన్నదే నా ఆకాంక్ష. నాటి ఆర్థిక సంస్కరణల తరువాత సంపద సృష్టికి బీజం పడింది. ప్రభుత్వ విధానాల ద్వారా సంక్షేమం, అభివృద్ధితో ప్రజల జీవితాల్లో మార్పులు మొదలయ్యాయి. నాలెడ్జ్ ఎకానమీతో అవకాశాలను అందిపుచ్చుకుని భారతీయులు, ముఖ్యంగా తెలుగు ప్రజలు అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. పేదరికం లేని సమాజం దిశగా రెండు రాష్ట్రాల ప్రయాణం సాగాలి. రానున్న రోజుల్లో ఆర్థిక అసమానతలను నిర్మూలించి....సమగ్ర సాధికారత సాధించాలి. రెండు రాష్ట్రాలు ఏర్పడి 10 ఏళ్లు అవుతున్న నేటి ఈ సందర్భంగా తెలుగు ప్రజల విజయాలు, కీర్తి ప్రపంచవ్యాప్తం కావాలి. భారతదేశం స్వాతంత్ర్యం సాధించి 100 ఏళ్లు పూర్తి అయ్యే 2047 నాటికి ప్రపంచంలో భారతీయులు అంతా అగ్రస్థానంలో ఉండాలి. అందులో తెలుగు జాతి నెంబర్ 1 అవ్వాలని ఆకాంక్షిస్తున్నాను."


చంద్రబాబు సందేశంలో ఎక్కడా తెలంగాణ అనే పదం లేదు, తెలంగాణ ఆవిర్భావం అనే ప్రస్తావన లేదు. అవేవీ లేకుండానే ఆయన శుభాకాంక్షలు తెలపడం గమనార్హం. జూన్-2 ని ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకోని ఏపీ ప్రజల్ని కూడా ఆయన ఇందులో కలపడం మరీ విచిత్రం. పైగా ఈ సందేశంలో కూడా సెల్ఫ్ డబ్బా మానుకోలేదు బాబు. నాటి ఆర్థిక సంస్కరణల తర్వాత సంపద సృష్టికి బీజం పడిందని, ప్రభుత్వ విధానాల ద్వారా సంక్షేమం, అభివృద్ధితో ప్రజల జీవితాల్లో మార్పులు మొదలయ్యాయని చెప్పుకొచ్చారు. చంద్రబాబు శుభాకాంక్షలు చెప్పకపోయినా పర్లేదు, మరీ ఈ స్టైల్ లో చెప్పి విమర్శలకు చోటివ్వడమెందుకని అంటున్నారు నెటిజన్లు. 

Tags:    
Advertisement

Similar News