జేసీ ఫ్యామిలీకి షాకిచ్చిన చంద్రబాబు
2019 ఎన్నికల్లో జేసీ పవన్‌కుమార్ రెడ్డి అనంతపురం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి లక్షా 41 వేల ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.
అనంతపురం రాజకీయాల్లో కీలకంగా ఉన్న జేసీ ఫ్యామిలీకి షాకిచ్చారు చంద్రబాబు. జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్‌కుమార్ రెడ్డితో పాటు జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి టీడీపీ నుంచి టికెట్ ఆశించారు. 2019లో ఈ ఇద్దరికి టికెట్ ఇచ్చిన చంద్రబాబు.. ఈసారి మాత్రం అస్మిత్ రెడ్డికి టికెట్ కేటాయించి.. పవన్‌కుమార్ రెడ్డికి హ్యాండిచ్చారు.
2019 ఎన్నికల్లో జేసీ పవన్‌కుమార్ రెడ్డి అనంతపురం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి లక్షా 41 వేల ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఇక అస్మిత్ రెడ్డి తాడిపత్రి నుంచి అసెంబ్లీకి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి చేతిలో 7 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. ఐతే ఈ సారి అస్మిత్ రెడ్డికి మాత్రమే టికెట్ ఇచ్చారు చంద్రబాబు. అనంతపురం ఎంపీ స్థానం నుంచి.. పవన్‌కుమార్ రెడ్డిని కాదని అంబికా లక్ష్మినారాయణకు అవకాశం ఇచ్చారు.
అనంతపురం పార్లమెంట్ సీటు ఇచ్చేందుకు కుదరకపోతే గుంతకల్, కల్యాణదుర్గం అసెంబ్లీ స్థానాలను పరిశీలించాలని పవన్‌కుమార్ రెడ్డి కోరినప్పటికీ చంద్రబాబు ఖాతరు చేయలేదు. గుంతకల్ నుంచి గుమ్మనూరు జయరాంను పోటీలో నిలిపారు. కల్యాణదుర్గంలో అమిలినేని సురేంద్రబాబుకు అవకాశం ఇచ్చారు. దీంతో రాబోయే ఎన్నికల్లో జేసీ పవన్‌కుమార్ రెడ్డి పోటీ చేసే అవకాశం కోల్పోయారు.