త్వరలో కార్యాచరణ ప్రకటిస్తా.. తిరుమలలో చంద్రబాబు
ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని సతీ సమేతంగా దర్శించుకున్నారు చంద్రబాబు. అలిపిరి వద్ద దాడి జరిగినప్పుడు శ్రీవారే తనను కాపాడారని చెప్పారు. త్వరలో తన కార్యాచరణ ప్రకటిస్తానని, ప్రజలకు సేవ చేసే శక్తి, సామర్థ్యాలు ఇవ్వాలని శ్రీవారిని వేడుకున్నానని అన్నారు.
మధ్యంతర బెయిల్ నుంచి సాధారణ బెయిల్ లోకి వచ్చిన చంద్రబాబు పూర్తి స్థాయి రాజకీయ కార్యకలాపాల కోసం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఆయన తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం భవిష్యత్ కార్యాచరణ గురించి మాట్లాడారు. త్వరలో తన ప్రణాళికను ప్రకటిస్తానన్నారు.
రాజమండ్రి జైలు నుంచి విడుదలైన తర్వాత జైలు ముందు సుదీర్ఘ ప్రసంగం ఇచ్చిన చంద్రబాబు.. ఆ తర్వాత పూర్తిగా సైలెంట్ అయ్యారు. అడపాదడపా మీడియా ముందు కనపడుతున్నా.. ఆయన ఎక్కడా నోరు మెదపలేదు. తిరుమలలో మాత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని సతీ సమేతంగా దర్శించుకున్నారు చంద్రబాబు. అలిపిరి వద్ద దాడి జరిగినప్పుడు శ్రీవారే తనను కాపాడారని చెప్పారు. త్వరలో తన కార్యాచరణ ప్రకటిస్తానని, ప్రజలకు సేవ చేసే శక్తి, సామర్థ్యాలు ఇవ్వాలని శ్రీవారిని వేడుకున్నానని అన్నారు. కష్టం వచ్చినప్పుడు స్వామివారిని మొక్కుకున్నానని, ఆ మొక్కు చెల్లించుకునేందుకే ఇప్పుడు తిరుమల వచ్చానన్నారు.
వాట్ నెక్స్ట్..?
తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం చంద్రబాబు ఏపీలోని ఇతర పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారని తెలుస్తోంది. బెజవాడ కనకదుర్గమ్మ, శ్రీశైల మల్లన్న, సింహాద్రి అప్పన్న దర్శనాలు చేసుకుంటారు. ఆ తర్వాత చంద్రబాబు తన పొలిటికల్ యాత్రలు ప్రారంభిస్తారని టీడీపీ వర్గాలంటున్నాయి.