బీజేపీతో చంద్రబాబు పొత్తు.. గతం గుర్తుచేసిన అసదుద్దీన్

చంద్రబాబు నాయుడు ఎప్పుడూ బీజేపీతోనే ఉన్నాడన్నారు అసదుద్దీన్. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చంద్రబాబు వాజ్‌పేయితో ఉన్నారని గుర్తుచేశారు.

Advertisement
Update:2024-03-12 20:05 IST

ఏపీలో తెలుగుదేశం, బీజేపీ పొత్తుపై స్పందించారు MIM చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. ఏపీ ఎన్నికల్లో ముస్లింలు, క్రిస్టియన్స్‌, దళితులు, ఆదివాసీలు బీజేపీ-టీడీపీ కూటమికి సరైన గుణపాఠం చెప్తారన్నారు. ప్రధాని మోడీని గతంలో చంద్రబాబు టెర్రరిస్టు అన్నారని గుర్తుచేశారు. అవసరమైతే పాత వీడియోలు చూడాలని సూచించారు.

చంద్రబాబు నాయుడు ఎప్పుడూ బీజేపీతోనే ఉన్నాడన్నారు అసదుద్దీన్. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చంద్రబాబు వాజ్‌పేయితో ఉన్నారని గుర్తుచేశారు. చంద్రబాబు నిరంతరం బీజేపీతో కుర్చీ షేర్ చేసుకుంటున్నారన్నారు అసదుద్దీన్. 2014లో మోడీ ప్రధాని అయ్యేందుకు చంద్రబాబు సపోర్ట్ చేశారన్నారు అసదుద్దీన్. కూటమి నుంచి బయటకు రాగానే మోడీని టెర్రరిస్టు అంటూ చంద్రబాబు దూషించాడన్నారు. ఇప్పుడు తిరిగి ఎన్డీఏ గూటికి చేరారని ఎద్దేవా చేశారు.


ఏపీ ఎన్నికల్లో ముస్లింలు, క్రిస్టియన్స్‌, దళితులు, ఆదివాసీలు కీ రోల్ ప్లే చేస్తారన్నారు అసదుద్దీన్. ఏం జరుగుతుందో మీరే చూస్తారంటూ కామెంట్స్ చేశారు. వైసీపీ అధినేత జగన్‌ తనకు మిత్రుడేనన్నారు. ఏపీలో MIM పోటీ చేయడంపై తాము ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు.

Tags:    
Advertisement

Similar News