ఏపీ కంటే తెలంగాణ బెటర్ -చంద్రబాబు

ఆమధ్య రజినీకాంత్ కూడా తెలంగాణ అభివృద్ధిని కొనియాడారు, ఆటోమేటిక్ గా వైసీపీ శ్రేణులకు టార్గెట్ అయ్యారు. ఇప్పుడు చంద్రబాబు కూడా తెలంగాణ అభివృద్ధిని మెచ్చుకున్నారు. దీనిపై వైసీపీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

Advertisement
Update:2023-06-06 21:24 IST

దేశంలోనే తెలంగాణ నెంబర్ 1 స్థానంలో ఉంది.

హైదరాబాద్ అభివృద్ధిలో దూసుకుపోతోంది.

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సమయంలో చంద్రబాబు చెప్పిన మాటలివి. టీడీపీ గొప్పతనం చెప్పుకునే క్రమంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసినా నిజం ఒప్పుకున్నారు. ఇదే చంద్రబాబు ఏపీ గురించి తరచూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందని, పరిశ్రమలు పారిపోతున్నాయని, దాడులు పెరిగిపోయాయని, ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోందని, ఏపీ మరో శ్రీలంకలా మారిపోతోందంటున్నారు. పరోక్షంగా చంద్రబాబు ఏపీకంటే తెలంగాణ బెటర్ అని తేల్చి చెప్పారు.

అంతా మా గొప్పతనమే..

తెలంగాణ దేశంలోనే నెంబర్-1 రాష్ట్రంగా మారుతోంది, ఇప్పటికే కొన్నిరంగాల్లో నెంబర్-1 స్థానంలోనే ఉంది. రాష్ట్రం వేరుపడిన తర్వాత అభివృద్ధి మరింత ఊపందుకుందనే విషయాన్ని ఎవరూ కాదనరు. అయితే అదంతా తమ గొప్పతనమే అని చెప్పుకుంటున్నారు చంద్రబాబు. ఆనాడు టీడీపీ వేసిన పునాది వల్లే ఈరోజు తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారాయన. హైదరాబాద్ అడుగడుగులో టీడీపీ ముద్ర ఉందని చెప్పారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీడీపీ శ్రేణులతో మాట్లాడిన చంద్రబాబు తెలంగాణలో ఏదో ఒకరోజు తప్పకుండా పార్టీకి పూర్వవైభవం వస్తుందని చెప్పారు. తెలంగాణలో అధికారంలో లేకపోయినా పార్టీ శ్రేణుల ఉత్సాహం బాగుందన్నారు.

ఏపీ, తెలంగాణ పోలిక ఎప్పుడు వచ్చినా తెలంగాణకే ఎక్కువ మార్కులు ఇస్తుంటారు అందరూ. ఆమధ్య రజినీకాంత్ కూడా తెలంగాణ అభివృద్ధిని కొనియాడారు, ఆటోమేటిక్ గా వైసీపీ శ్రేణులకు టార్గెట్ అయ్యారు. ఇప్పుడు చంద్రబాబు కూడా తెలంగాణ అభివృద్ధిని మెచ్చుకున్నారు. దీనిపై వైసీపీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. 

Tags:    
Advertisement

Similar News