తెలంగాణలో వరుస రాజీనామాలు..!

దాదాపు 18కి పైగా కార్పొరేషన్ల చైర్మన్లు రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపారు. సంబంధిత కార్యాలయాలను ఖాళీ చేశారు.

Advertisement
Update:2023-12-04 18:17 IST

తెలంగాణలో ప్రభుత్వం మారడంతో వరుస రాజీనామాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ ట్రాన్స్‌ కో, జెన్‌ కో సీఎండీ ప్రభాకరరావు తన బాధ్యతల నుంచి వైదొలిగారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి పంపారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ప్రభాకరరావు తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభాకర్‌రావు సీఎండీగా నియమితులయ్యారు. ఆయనతో పాటు సాంస్కృతిక సలహాదారు రమణాచారి సైతం తన పదవికి రాజీనామా చేశారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, టాస్క్‌ ఫోర్స్‌ OSD రాధా కిషన్ రావులు సైతం రాజీనామాలు చేశారు.

ఇక వీరితో పాటు దాదాపు 18కి పైగా కార్పొరేషన్ల చైర్మన్లు రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపారు. సంబంధిత కార్యాలయాలను ఖాళీ చేశారు. రాజీనామా చేసిన వారు వీరే..

సోమ భరత్ కుమార్

చైర్మన్, రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్

జూలూరి గౌరీ శంకర్

చైర్మన్, తెలంగాణ సాహిత్య అకాడమీ

పల్లె రవి కుమార్ గౌడ్

చైర్మన్, రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్

డాక్టర్ ఆంజనేయ గౌడ్

చైర్మన్, స్పోర్ట్స్ అథారిటీ

మేడె రాజీవ్ సాగర్

చైర్మన్, TS Foods Corporation

డా. దూదిమెట్ల బాలరాజు యాదవ్‌

చైర్మ‌న్, గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ

గూడూరు ప్రవీణ్

చైర్మన్, టెక్స్‌టైల్ కార్పొరేషన్

గజ్జెల నగేష్

చైర్మన్, బేవరేజెస్ కార్పొరేషన్

అనిల్ కూర్మాచలం

చైర్మన్, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్

రామచంద్ర నాయక్

చైర్మన్, ట్రైకార్

వలియా నాయక్

చైర్మన్, గిరిజన ఆర్థిక సహకార సంస్థ

వై సతీష్ రెడ్డి

చైర్మన్, పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ

డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్

చైర్మన్, రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల కల్పన సంస్థ

రవీందర్ సింగ్

చైర్మన్, పౌర సరఫరాల సంస్థ

జగన్మోహన్ రావు

చైర్మన్, రాష్ట్ర టెక్నాలజికల్ సర్వీసెస్

Tags:    
Advertisement

Similar News