అవార్డ్ ఇచ్చారు ఇకనైనా నోళ్లు మూస్తారా..?

తెలంగాణకు జల్ జీవన్ అవార్డు ప్రదానం చేసింది కేంద్రం. కుళాయిల కనెక్షన్లలో నెంబర్1 అంటూ కితాబిచ్చింది. ఢిల్లీలో ఈ అవార్డు ప్రదానోత్సవం జరిగింది.

Advertisement
Update:2022-10-02 16:53 IST

మిషన్ భగీరథకు ఎలాంటి అవార్డు ప్రకటించలేదు అనేది తప్పుడు ప్రచారం అని రుజువైంది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో జల్ జీవన్ మిషన్ అవార్డ్ ని తెలంగాణ ప్రభుత్వం అందుకుంది. ప్రశంసా పత్రం కూడా కేంద్రం అందించింది. రాష్ట్రంలో 60 శాతానికి పైగా ఇళ్లకు మంచినీటి కనెక్షన్లు ఇవ్వడంతో పాటు వాటి నిర్వహణలో కూడా దేశంలోనే తెలంగాణ నెంబర్1 స్థానంలో ఉందని కితాబిచ్చింది. అంతా బాగానే ఉంది కానీ, మధ్యలో ఆ తప్పుడు ప్రచారమే కేంద్రం పరువు తీసింది.

గతంలో మిషన్ భగీరథపై బీజేపీ జాతీయ నాయకులు అవాకులు చెవాకులు పేలారు. ఆ తర్వాత కేంద్రం అవార్డ్ ప్రకటించడంతో వాళ్లకు నోట మాట రాలేదు. వాస్తవానికి తెలంగాణకు అవార్డ్ రాకుండా అడ్డుకోవాలనేది వాళ్ళ కుటిల ప్రయత్నం. కానీ ఐటీలో ఎలాగైతే అవార్డులు ఇవ్వక తప్పలేదో, మిషన్ భగీరథకు కూడా అవార్డ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. మిషన్ భగీరథను గుర్తించక పోతే జల్ జీవన్ అవార్డులకు అర్థమే ఉండదు. అందుకే నోటితో పొగిడి నొసటితో వెక్కిరించాలనుకున్నారు. కానీ అది సాధ్యం కాలేదు. అక్కడితో ఆగితే బాగుండేది. అక్కడే కేంద్రం నీచానికి దిగింది. మిషన్ భగీరథకు అవార్డ్ రాలేదని బొంకారు. అంతేకాదు కొన్ని మీడియా సంస్థలకు లీకులిచ్చి మరీ రెచ్చగొట్టారు. ఆ తర్వాత టీఆర్ఎస్ నేతలు తిరగబడటంతో కేంద్రం వెనక్కు తగ్గింది.

ఇప్పుడేమంటారు..?

మిషన్ భగీరథకు అవార్డ్ రాలేదని బొంకిన మీడియా సంస్థలు ఇప్పుడు ఏమని వివరణ ఇస్తాయి. అవార్డ్ ఇచ్చారని రాస్తారా, లేక కేంద్రం వివరణ అడిగి సవరణ ప్రచురిస్తారా..?

అవార్డ్ ఇవ్వకపోవడం వేరు. ప్రకటించిన తర్వాత తప్పుడు ప్రచారం చేయడం వేరు. ఈ అవార్డ్ విషయంలోనే కేంద్రం తన వక్ర బుద్ధి చూపించింది. కుట్ర బుద్ధి బయట పెట్టుకుంది. చివరకు అవార్డ్ చేతిలోపెట్టి ఫొటోలకు నవ్వుతూ ఫోజులిచ్చి, మనసులో ఏడ్చుకున్నారు నేతలు. కనీసం మిషన్ భగీరథకు ఆర్ధిక సాయం చేసి ఉంటే ఈ విజయంలో తమకు కూడా వాటా దక్కేదేమో అని మధనపడ్డారు. ఇదీ వీళ్ళ విశ్వసనీయత.

Tags:    
Advertisement

Similar News