క్యాబినెట్ సబ్ కమిటీకి కులగణన నివేదిక
కులగణన నివేదిక నివేదికను క్యాబినెట్ సబ్ కమిటీకి రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ అధికారులు సమర్పించారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే, కులగణన నివేదిక నివేదికను క్యాబినెట్ సబ్ కమిటీకి రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ అధికారులు సమర్పించారు. రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ ప్రిన్సిపాల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా బృందం రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీకి కులగణన కు సంబంధించిన నినేధికను ఇవాళ సచివాలయంలో జరిగిన సమావేశంలో కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ కులగణన నివేదికను అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 రోజుల పాటు కులగణ జరిగింది. సుమారు 3.54 కోట్ల మంది డేటాను నమోదు చేసినట్లు కమిషన్ పేర్కొంది.
96.9 శాతం కుటుంబాలను సర్వే చేసినట్లు వెల్లడించారు. ఈ సర్వేలో దాదాపు 76 ప్రశ్నలతో కూడిన సర్వేను నిర్వహించి రాష్ట్ర ప్రజల ఆర్థిక స్థితిగతులు పాటు అన్ని వివరాలను సేకరించారు. కాగా ఈ కులగణన నివేదికపై సోమవారం కేబినెట్ సబ్ కమిటీలో చర్చించిన అనంతరం దానికి ఆమోదం తెలపనుంది. అనంతరం నివేదికను రెడీ చేసి ఈ నెల 5న ఉదయం జరగనున్న కేబినెట్ సమావేశంలో ప్రవేశపెడతారు. అక్కడ ఆమోదించిన తర్వాత అదే రోజు మధ్యాహ్నం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించి ఈ కులగణన నివేదికను ప్రవేశపెట్టనున్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు.