చారిత్రక నిర్ణయాలు.. ఊరూవాడా సంబరాలు
రాష్ట్ర ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు బీఆర్ఎస్ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు మంత్రి కేటీఆర్. ఈమేరకు ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులకు టెలికాన్ఫరెన్స్ లో సూచించారు.
ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకోవడంతో ఊరూవాడా సంబరాలు మొదలయ్యాయి. పలు ఆర్టీసీ డిపోల్లో ఉద్యోగులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తమ చిరకాలవాంఛ నెరవేర్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.
మెట్రో విస్తరణతో తమ ప్రాంతాల అభివృద్ధి మెరుగవుతుందని అంటున్నారు షాద్ నగర్ వాసులు. మెట్రో ఏర్పాటు నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు, తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
అటు రాష్ట్ర ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు బీఆర్ఎస్ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు మంత్రి కేటీఆర్. వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేయడం, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం, నగరంలో మెట్రో భారీ విస్తరణ వంటి అంశాల నేపథ్యంలో ఎక్కడికక్కడ సంబరాలు చేయాలని చెప్పారు. ఈమేరకు పార్టీ ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులకు టెలికాన్ఫరెన్స్ లో సూచించారు కేటీఆర్.
అనాధల పాలసీని తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కేటీఆర్ చెప్పారు. దేశంలోనే ఇలాంటి వినూత్న నిర్ణయంతో అనాధలకు ఆసరాగా నిలబడింది బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల వలన ఇబ్బందులు పాలైన ప్రజలకు ఉపశమనం అందించేలా రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సహాయంగా ప్రకటించిన 500 కోట్ల రూపాయలు ప్రజలకు ఉపయుక్తంగా ఉంటాయని చెప్పారు మంత్రి కేటీఆర్. రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలన్నింటినీ పై ఎక్కడికక్కడ జిల్లా కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజల్లోకి ప్రభుత్వ ఆలోచనలను తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు.