రేవంత్ ఏం సాధించారని సంబరాలు చేస్తున్నారు : ఈటల రాజేందర్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలుకు సాధ్యం కానీ హామీలతో ప్రజలను మోసం చేస్తోందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలుకు సాధ్యం కానీ హామీలతో ప్రజలను మోసం చేస్తోందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నాంపల్లి బీజేపీ కార్యాలయంలో నివాళులర్పించిన అనంతరం ఈటల మాట్లాడారు. ఈ దేశంలో ప్రజలందరికి సమాన అవకాశలు ఉండాలని చాటి చేప్పిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రజలకు సేవకులుగా ఉండాలని చెప్పారన్నారు. వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడి ఆశయాలను గుర్తు చేసుకొని అమలు చేయడానికి కృషి చేయాలని కోరారు. రాష్ట్రంలో ఏం సాధించారని సంబరాలు చేస్తున్నారని ఈటల ప్రశ్నించారు. హోదా, స్థాయి మరిచి ఆయన చిల్లర మాటలు మాట్లాడుతున్నారు.
కిషన్‌రెడ్డికి డీఎన్‌ఏ పరీక్ష జరగాలన్న వ్యాఖ్యలకు శిక్ష తప్పదు. కాంగ్రెస్ దుర్మార్గాలను ఖండిస్తూ నిర్వహించే సభకు ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతారు’’ అని ఈటల రాజేందర్ తెలిపారు. చేవలేని కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఓడిస్తే సిగ్గు లేకుండా ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. మహారాష్ట్రలో ప్రజలు బీజేపీని గెలిపించుకోవానే ఉద్దేశంతో గెలిపించారని కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి చెప్పారని అన్నారు.మోదీ ఎదుగుదలను అడ్డుకోవాలని, దేశం ప్రతిష్ఠను దిగజార్చాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ నేతలు ఉన్నారని ఈటల రాజేందర్ తెలిపారు. తెలంగాణ గడ్డమీద ఎగరాల్సిన జెండా బీజేపీదని ప్రజల మనసులలో ఉందని చెప్పారు. ఇది ఇంటెలిజెన్స్ చేసిన సర్వేలో బయటపడిందని చెప్పుకొచ్చారు. అందరం కలిసి పనిచేసుకుందామని, నిబద్ధతతో పనిచేసి బీజేపీని గెలిపించుకుందామని తెలిపారు. తెలంగాణలో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప ఏ హామీని కూడా నెరవేర్చడం లేదని అన్నారు.