అధికారంలోకి వస్తే జాతీయ స్థాయిలో కులగణన : రాహుల్ గాంధీ

కులగణనలో దేశానికే తెలంగాణ రోల్ మోడల్ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. నేడు హైదరాబాద్ బోయినపల్లిలోని ఐడియాలజీ సెంటర్ లో మేధావులు, బీసీ సంఘాలతో రాహుల్ ముఖాముఖి నిర్వహించారు.

Advertisement
Update:2024-11-05 19:40 IST

కులగణనలో దేశానికే తెలంగాణ రోల్ మోడల్ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. నేడు హైదరాబాద్ బోయినపల్లిలోని ఐడియాలజీ సెంటర్ లో మేధావులు, బీసీ సంఘాలతో రాహుల్ ముఖాముఖి నిర్వహించారు. భారతదేశంలో కుల వివక్షత ఉన్నదన్నది వాస్తవన్నారు. దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని ఇదివరకే చెప్పామని, దానిని నెరవేర్చుతామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఈ సర్వేపై తాను ఎంతో సంతోషిస్తున్నానని.. ప్రధాని మోదీ ఇంత వరకు కులవివక్ష గురించి మాట్లాడలేదు.

దేశంలో ఎంత మంది దళిత వ్యాపారులు ఉన్నారో చెప్పాలి. బ్యూరో క్రాట్స్ చేసే కులగణన మనకు అవసరం లేదు. మేము చేస్తున్నది కుల గణన కాదు.. అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలో నిర్ణయిస్తున్నాం. రిజర్వేషన్ల పై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తేస్తున్నామని తెలిపారు. దేశంలో ఎంత మంది నిరుపేదలు ఉన్నారో తెలుసుకోవాలి. జాతీయ స్థాయిలో కులగణన చేపడుతామని పార్లమెంట్ సాక్షిగా చెప్పినట్టు గుర్తు చేశారు రాహుల్ గాంధీ. కులగణనలో ఏ ప్రశ్నలు అడగాలో దళితులు, ఆదివాసులు, ఓబీసీలే నిర్ణయించాలన్నారు. దేశంలో ఎంతమంది ఓబీసీలు న్యాయ వ్యవస్థలో ఉన్నారు. దేశం ఆర్థికంగా శక్తిమంతంగా ఎదగాలంటే కుల వివక్ష ఉండకూడదని పేర్కొన్నారు రాహుల్ గాంధీ.

Tags:    
Advertisement

Similar News