హైదరాబాద్ లో భారీగా బంగారం, నగదు సీజ్..

మియాపూర్‌ క్రాస్ రోడ్స్ వద్ద చేపట్టిన తనిఖీల్లో పోలీసులకు 17 కిలోల బంగారం, 17.5 కిలోల వెండి పట్టుబడింది. బంగారం, వెండి ఆభరణాలకు సంబంధించిన బిల్లులు చూపలేకపోవడంతో పోలీసులు దాన్ని సీజ్‌ చేశారు.

Advertisement
Update:2023-10-16 15:58 IST

హైదరాబాద్ లో భారీగా బంగారం, నగదు సీజ్..

ఎన్నికల వేళ పోలీసు తనిఖీల్లో భారీగా నగదు, బంగారం పట్టుబడుతున్నాయి. షెడ్యూల్ విడుదలైనప్పటినుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా నగదు స్వాధీనం చేసుకుంటున్నారు పోలీసులు. తాజాగా నార్త్‌జోన్‌ టాస్క్‌ ఫోర్స్‌, గాంధీ నగర్‌ పోలీసులు కవాడిగూడ ఎన్టీపీసీ బిల్డింగ్‌ వద్ద చేపట్టిన తనిఖీల్లో అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న డ‌బ్బు ప‌ట్టుబ‌డింది. కారులో అక్రమంగా తరలిస్తున్న రూ.2.9కోట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ ఘటనలో ఆరుగురిని అరెస్టు చేశారు. ఒక కారు, బైక్ సీజ్ చేశారు.

బంగారం, వెండి..

మియాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పెద్ద ఎత్తున బంగారం, వెండిని పోలీసులు పట్టుకున్నారు. మియాపూర్‌ క్రాస్ రోడ్స్ వద్ద చేపట్టిన తనిఖీల్లో పోలీసులకు 17 కిలోల బంగారం, 17.5 కిలోల వెండి పట్టుబడింది. బంగారం, వెండి ఆభరణాలకు సంబంధించిన బిల్లులు చూపలేకపోవడంతో పోలీసులు వాటిని సీజ్‌ చేశారు. అటు వనస్థలిపురంలో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో కారులో అక్రమంగా తరలిస్తున్న రూ.29.40లక్షలను స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ పరిధిలోని మాదాపూర్‌ లో పోలీసులు భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. అయ్యప్ప సొసైటీలో వాహనాలను తనిఖీ చేస్తుండగా.. రూ.32 లక్షల నగదు పట్టుబడింది. గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మరో రూ.10లక్షల నగదును పోలీసులు పట్టుకున్నారు.

జిల్లాల్లో కూడా విస్తృత తనిఖీలు..

ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు జిల్లాల్లో కూడా పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. నల్గొండ జిల్లా వాడపల్లి ప్రాంతంలో ఆదివారం రూ.3.04 కోట్ల నగదుతో పాటు రూ.18 లక్షల విలువగల కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌ ప్రాంతానికి చెందిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు కర్నాటక నుంచి పెద్దఎత్తున నగదుని అక్ర‌మంగా తెలంగాణకు తరలిస్తున్నారనే ఆరోపణలు కూడా వినపడుతున్నాయి. బెంగళూరులో 45కోట్ల రూపాయలను సీజ్ చేశారు.

Tags:    
Advertisement

Similar News