అమిత్ షా, మాధవీలత, రాజాసింగ్‌పై కేసు.. ఎందుకంటే.!
అమిత్ షా దగ్గర ఉన్న ఓ చిన్నారి చేతిలో ఉన్న బ్యానర్‌పై కమలం పువ్వు గుర్తుతో పాటు మరో ఇద్దరు చిన్నారుల చేతికి అబ్ కీ బార్ 400 సీట్స్ అని రాసి ఉందని నిరంజన్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు షాకిచ్చారు హైదరాబాద్ పోలీసులు. అమిత్ షాపై మొఘల్‌పురా పీఎస్‌లో కేసు నమోదైంది. ఇటీవల ఓల్డ్‌సిటీ పర్యటనలో అమిత్ షా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్‌ను ఉల్లంఘించారని పీసీసీ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ ఢిల్లీలో ఈసీకి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. అమిత్ షా దగ్గర ఉన్న ఓ చిన్నారి చేతిలో ఉన్న బ్యానర్‌పై కమలం పువ్వు గుర్తుతో పాటు మరో ఇద్దరు చిన్నారుల చేతికి అబ్ కీ బార్ 400 సీట్స్ అని రాసి ఉందని నిరంజన్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఎన్నికల నియమాలను బీజేపీ పట్టించుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు నిరంజన్. ఇక హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత మాట్లాడే సమయంలో అమిత్ షా సైగ చేయడంతో కొంతమంది మైనర్ చిన్నారులు అక్కడకు వెళ్లారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ జరిగిన సంఘటనపై విచారణ జరిపించాలని హైదరాబాద్ పోలీసు కమిషనర్‌ను ఆదేశించారు.
విచారణ జరిపిన మొఘల్ పురా పోలీసులు కేసు నమోదు చేశారు. IPC సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. A1గా యమాన్ సింగ్, A2గా హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాధవీ లత, A3గా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, A4గా బీజేపీ స్టేట్ చీఫ్ జి.కిషన్ రెడ్డి, A5గా MLA రాజాసింగ్‌ను పేర్కొన్నారు పోలీసులు.