మంత్రి పొంగులేటికి తప్పిన ప్రమాదం
ఒకేసారి పేలిన రెండు టైర్లు.. డ్రైవర్ చాకచక్యంతో మంత్రి సేఫ్
Advertisement
మంత్రి పొంగులేని శ్రీనివాస్ రెడ్డికి భారీ ప్రమాదం తప్పింది. వరంగల్ నుంచి ఖమ్మం వెళ్తుండగా ఆదివారం రాత్రి ఆయన ప్రయాణిస్తున్న కారు రెండు టైర్లు ఒకేసారి పేలాయి. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి కారును నిలిపివేయడంతో మంత్రికి ప్రమాదం తప్పింది. కాన్వాయ్ లోని మిగతా డ్రైవర్లు కూడా అప్రమత్తంగా వ్యవహరించడంతో కార్లు ఢీకొనకుండా ఆపగలిగారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో మంత్రితో పాటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఉన్నారు. ప్రమాదం తర్వాత ఎస్కార్ట్ వాహనంలో మంత్రి ఖమ్మం జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఆయనకు ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Advertisement