ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కేబినెట్‌ సబ్‌ కమిటీ

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో కమిటీ ఏర్పాటు

Advertisement
Update:2024-11-08 18:24 IST

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేసింది. శుక్రవారం ఈమేరకు ఉత్తర్వులు ఇచ్చింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చైర్మన్‌ గా ఉన్న ఈ కమిటీలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, పొన్నం ప్రభాకర్‌, ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు ను సభ్యులుగా నియమించారు. జీఏడీ (సర్వీసెస్‌) ప్రిన్సిపల్‌ సెక్రటరీ కమిటీకి మెంబర్‌ కన్వీనర్‌ గా వ్యవహరిస్తారు. అన్ని శాఖల స్పెషల్‌ సీఎస్‌ లు/ప్రిన్సిపల్‌ సెక్రటరీలు ఈ సబ్‌ కమిటీని నిర్వహించే సమావేశాలకు హాజరుకావాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ నేతలతో సీఎం రేవంత్‌ రెడ్డి పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయా సంఘాల నేతలు లేవనెత్తిన అంశాలు, వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేస్తామని సీఎం అదే రోజు హామీ ఇచ్చారు. ఆ హామీలో భాగంగా శుక్రవారం కమిటీ ఏర్పాటు చేశారు. రేవంత్‌ రెడ్డి సీఎం అయ్యాక అనేక అంశాలపై నిర్ణయాలు తీసుకునేందుకు పదికి పైగా కేబినెట్‌ సబ్‌ కమిటీలు ఏర్పాటు చేశారు. ఏ ఒక్క కమిటీ పూర్తి స్థాయి నివేదిక ఇవ్వలేదు. ఉద్యోగుల డిమాండ్లను కమిటీ పేరుతో కాలయాపన చేయాలనే ప్రభుత్వం చూస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. 

Tags:    
Advertisement

Similar News