కీలక అంశాలపై నేడు కేబినెట్‌ భేటీ

జీవో 317 పై , ఉద్యోగుల పెండింగ్‌ డీఏలపై స్పష్టత వచ్చే అవకాశం

Advertisement
Update:2024-10-26 10:20 IST

కీలక అంశాలే అజెండగా సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన నేడు మంత్రి వర్గ సమావేశం జరగనున్నది. జీవో 317 బాధితులు ఇప్పటికే నిరసన బాట పట్టారు. ఇటీవల గాంధీభవన్‌ ముందు బైఠాయించారు. అలాగే ఉద్యోగులు కూడా ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. పెండింగ్‌ డీఏలను ప్రభుత్వం క్లియర్‌ చేయడం లేదని ఆగ్రహంతో ఉన్నారు. ఉద్యోగ సంఘాల నేతలు దీనిపై సీఎస్‌తో భేటీ అయి ఉద్యోగుల సమస్యలను వారి దృష్టికి తీసుకొచ్చారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు సీఎం సమావేశమయ్యారు.ఉద్యోగుల డీఏ చెల్లింపు విషయంపై శుక్రవారం సాయంత్రంలోగా నిర్ణయం ప్రకటిస్తామని సీఎం చెప్పారు. కానీ ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

అలాగే ఉద్యోగులకు సంబంధించి వివిధ సమస్యల పరిశీలన కోసం డిప్యూటీ సీఎం నేతృత్వంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు , పొన్నం ప్రభాకర్ సభ్యులుగా, కేశవరావు ప్రత్యేక ఆహ్వానితులుగా కేబినేట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. దీపావళి తర్వాత శాఖల వారిగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కేబినేట్ సబ్ కమిటీ సమావేశమవుతుందని సీఎంతో ప్రకటించింది. ఈ లోగా జీవో 317 పై మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే సమర్పించిన నివేదికపై కేబినేట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని తెలిపింది. ఈ నేపథ్యంలో ఇవాళ కేబినెట్‌ భేటీ కీలకంగా మారింది.

కేబినెట్‌ భేటీని ఈ నెల 23న నిర్వహించాలని భావించినప్పటికీ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, తుమ్మల నాగేశ్వర్‌రావు విదేశీ పర్యటన కారణంగా నేటికి వాయిదా వేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలక సంబంధించిన జీవో 317 పై మంత్రివర్గ ఉపసంఘం నివేదికను కేబినెట్‌ ఆమోదించనున్నది. స్పౌస్‌, అనారోగ్యం, వితంతువు కేటగిరిని పరిగణనలోకి తీసుకుని జీవో 317 బాధితులను బదిలీ చేయాలని కేబినెట్‌ సబ్‌ కమిటీ సిఫార్సు చేసినట్లు సమాచారం. పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏ బిల్లులపై మంత్రివర్గం గుడ్‌ న్యూస్‌ చెబుతుందని ఉద్యోగులు ఆశతో ఉన్నారు. ధాన్యం సేకరణపై కేబినెట్‌ సబ్‌ కమిటీ సమర్పించిన నివేదికను మంత్రివర్గం ఆమోదించనున్నది. మిల్లింగ్‌ ఛార్జీల పెంపు, బ్యాంకు గ్యారెంటీలు, సన్న ధాన్యం కొనుగోళ్లు, డిఫాల్టర్లపై చర్యలు సహా పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది. 

Tags:    
Advertisement

Similar News