హైడ్రాకు విస్తృత అధికారాలు ఇస్తూ కేబినెట్ నిర్ణయం
హైడ్రాకు తెలంగాణ క్యాబినెట్ చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. మిగతా శాఖలకు ఉండే పూర్తి స్వేచ్చ హైడ్రాకు వర్తిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
హైడ్రాకు తెలంగాణ క్యాబినెట్ చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. మిగతా శాఖలకు ఉండే పూర్తి స్వేచ్చ హైడ్రాకు వర్తిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. హైడ్రాకు 169 మంది అధికారులు, 964 మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని కేటాయిస్తున్నామని తెలిపారు. ఓఆర్‌ఆర్ లోపల 27 అర్బన్, లోకల్ బాడీలు ఉన్నాయి. 51 గ్రామ పంచాయతీలను కోర్ అర్బన్‌లో చేర్చామన్నారు.
ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణభాగం అలైన్‌మెంట్ ఖరారుకు కమిటీ ఏర్పాటు. ఆర్‌అండ్‌బీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆధ్వరయంలో 12 మందితో కమిటీ. ఈ కమిటీ కన్వీనర్‌గా ఆర్‌అండ్‌బీ ప్రిన్సిపల్ సెక్రటరీ నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. పోలీసు ఆరోగ్య భద్రత స్కీమ్ ఎస్‌పీఎల్‌కు కూడా వర్తింస్తుందని మంత్రులు తెలిపారు. ఎస్ఎల్ బీసీ టన్నెల్ వర్క్స్ 4,637 కోట్లకు రివైజ్డ్ ఎస్టిమేషన్ ఇచ్చామని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. రెండేళ్లలో ఎస్ఎల్ బీసీ టన్నెల్ పనులను పూర్తిచేస్తామన్నారు. సెప్టెంబర్ 2027 వరకు పూర్తిచేస్తామని టన్నెల్ చారిత్రాత్మకం కానుంది మంత్రి పేర్కొన్నారు. జనవరి నుండి రేషన్ కార్డ్ లకు సన్న బియ్యం ఇస్తామని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. నల్గోండ జిల్లాని ఫ్లోరైడ్ రహితంగా మారుస్తామని ఆయన తెలిపారు.