ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్లో చోరీ.. కీలక పత్రాలు మాయం

కొమురంభీం జిల్లా కాగజ్ నగర్ మండలంలోని కోసినిలో బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్లో చోరీకి పాల్పడ్డ దొంగలు.. బీరువా తాళాలు పగులగొట్టి విలువైన పత్రాలు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తుంది.

Advertisement
Update:2024-10-31 13:56 IST

బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్లో చోరీ జరిగింది. కొమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌ మండలం కోసిని గ్రామంలో ఆర్ఎస్పీ నివాసంలో గత రాత్రి దొంగలు ఇంట్లోకి చొరబడి బీరువా తాళాలు పగలగొట్టి విలువైన పత్రాలు దొంగిలించినట్లు తెలుస్తోంది. ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటన స్థలంకు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన తరువాత ఎన్నికల సమయం ముందు ప్రవీణ్ కుమార్ ఆ నివాసాన్ని కొనుగోలు చేశారు. ఆర్ఎస్పీ హైదరాబాద్‌లో ఉన్న సమయంలో స్థానికంగా కొందరు నేతలు అక్కడ ఉంటున్నారు.

అయితే, బుధవారం రాత్రి ఆ ఇంట్లో ఎవరు లేరు, ఆర్ఎస్పీ కూడా హైదరాబాద్ లో ఉన్నారు. దీంతో గుర్తు తెలియని దుండుగులు ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలోని కీలక పత్రాలను ఎత్తుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఉదయాన్నే ఇంటి తాళాలు తెరిచేందుకు రాగా.. తాళాలతోపాటు లోపల బీరువా తాళాలు పగలగొట్టినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దొంగతనం జరిగిన తీరుపై దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరా ఉండటంతో పోలీసులు దానిని పరిశీలించనున్నారు. అయితే, దొంగలు బీరువాలోని కీలక పత్రాలను ఎత్తుకెళ్లినట్లు టాక్. తెలంగాణలో దోపిడి దొంగల పాలన నడుస్తుంది.. నిన్న సిర్పూర్-కాగజ్ నగర్ కోసిని గ్రామంలోని మా స్వగృహంలో దొంగలు పడ్డారు. కొన్ని విలువైన డాక్యుమెంట్లు దొచుకోని పోయారు.. దీని వెనక ఉన్న కుట్ర కోణాన్ని కూడా శోధించాల్సిందిగా డీజీపీ జీతేందర్‌ని కోరిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు

Tags:    
Advertisement

Similar News