మూసీ పక్కన ఇళ్లు కట్టుకోండి

మూసీ సుందరీకరణ పనులు చేయండి.. మూసీ పక్కన ముఖ్యమంత్రి ఇల్లు కట్టండి మాకేమీ అభ్యంతరం లేదని కిషన్‌రెడ్డి ఎద్దేవా

Advertisement
Update:2024-10-18 14:02 IST

డ్రైనేజీ సమస్య పరిష్కారం కాకుండా మూసీ సుందరీకరణ జరగదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణలోని 30 శాతం జనాభా హైదరాబాద్‌లోనే ఉన్నదన్నారు. మూసీ సుందరీకరణను ఎవరూ వ్యతిరేకించడం లేదని స్పష్టం చేశారు. ఇప్పుడున్న మూసీకి రెండువైపులా రిటైనింగ్‌ వాల్‌ను నిర్మించి అభివృద్ధి చేయవచ్చని సూచించారు. 30 ఏళ్ల కిందట కట్టుకున్న పేదల ఇళ్లను కూల్చివేయవద్దని మాత్రమే డిమాండ్‌ చేస్తున్నామన్నారు. ముషీరాబాద్‌ నియోజకవర్గంలోని గాంధీనగర్‌ డివిజన్‌ ఆంధ్రా కేఫ్‌ ఎక్స్‌ రోడ్‌లో స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో కలిసి సేవరేజ్‌ లైన్‌ను కిషన్‌రెడ్డి ప్రారంభించారు. 'మూసీ సుందరీకరణ పనులు చేయండి.. మూసీ పక్కన ముఖ్యమంత్రి ఇల్లు కట్టండి' మాకేమీ అభ్యంతరం లేదని ఎద్దేవా చేశారు. కష్టపడి నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేసి డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు ఇస్తాం.. రూ. 25 వేలు ఇస్తాం.. ఖాళీ చేయమనడం న్యాయం కాదని హితవు పాలికారు. స్థానిక ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా మూసీ సుందరీకరణ పనులు చేయవచ్చని సూచించారు.

Tags:    
Advertisement

Similar News