బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటే.. ఇది మరో సాక్ష్యం

ఓవర్గాన్ని ఉద్దేశిస్తూ మోడీ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా 20 వేల ఫిర్యాదులు వచ్చాయన్నారు కేటీఆర్. ఈసీ వాటిపై కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదన్నారు.

Advertisement
Update:2024-05-03 07:44 IST

భారత ఎన్నికల సంఘం బీజేపీ కనుసన్నల్లో పనిచేస్తోందని విమర్శించారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్. ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్‌షా మత వైషమ్యాలు రెచ్చగొట్టేవిధంగా మాట్లాడినా, సీఎం రేవంత్‌రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నా ఎలాంటి చర్యలు లేవన్నారు. ఎన్నికల సంఘం స్వతంత్ర సంస్థ అయితే మోడీ, రేవంత్‌పై చర్యలు తీసుకోవడానికి ఎందుకు భయపడుతుందని కేటీఆర్‌ నిలదీశారు. కేసీఆర్‌ గొంతును 48 గంటలు నిషేధించగ‌ల‌రేమో, కానీ గ్రామగ్రామాన కేసీఆర్‌ తయారు చేసిన గులాబీ సైనికులను అడ్డుకోలేరని స్పష్టం చేశారు.

కేసీఆర్‌కు భయపడే..

ఓవర్గాన్ని ఉద్దేశిస్తూ మోడీ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా 20 వేల ఫిర్యాదులు వచ్చాయన్నారు కేటీఆర్. ఈసీ వాటిపై కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదన్నారు. రేవంత్‌రెడ్డితోపాటు కాంగ్రెస్‌, బీజేపీ నాయకులపై తాము ఇప్పటివరకు 27 ఫిర్యాదులు చేశామన్నారు. ఒక్కదానిపైనా చర్యలు తీసుకోలేదన్నారు. బీజేపీ అభ్యర్థి అరుణ్‌గోగుల్‌ రాముడి ఫొటోతో ఎన్నికల ప్రచారం చేస్తున్నా, మోడీ విద్వేష వ్యాఖ్యలు చేసినా, అమిత్‌షా దేవుని ఫొటోలు పెట్టుకొని ఓట్లు అడిగినా ఎన్నికల కమిషన్‌లో ఉలుకు, పలుకు లేదన్నారు. కానీ, కేసీఆర్‌ విషయంలో మాత్రం ఆగమేఘాల మీద నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు. కాంగ్రెస్‌, బీజేపీ వేరువేరు కాదని మరోసారి రుజువైందన్నారు కేటీఆర్.

Tags:    
Advertisement

Similar News