ఈసారి కేటీఆర్‌ వంతు.. రేవంత్‌కు బహిరంగ లేఖ

ఇటీవల కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం ప్రతి కార్మికుని గుండెను గాయపరిచింది. ఈ క్రమంలోనే ఆర్థిక ఇబ్బందులతో సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శ్రీనివాస్ అనే నేత కార్మికుడు ఉరేసుకుని చనిపోయాడు.

Advertisement
Update:2024-04-04 13:24 IST

రాష్ట్రంలోని నేత‌న్నల‌పై కాంగ్రెస్ స‌ర్కార్ క‌క్ష క‌ట్టింద‌న్నారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నేత‌న్నలు ఆత్మహ‌త్యలు చేసుకుంటున్నా పట్టించుకోరా?. కార్మికులు రోడ్డున ప‌డ్డా క‌న‌క‌రించ‌రా అని సర్కారును ప్రశ్నించారు. ఈ మేర‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. "ఈ ప‌దేండ్లలో నేత‌న్నల‌కు చేతి నిండా పని క‌ల్పిస్తే.. కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత స‌మైక్య రాష్ట్రంలో నాటి సంక్షోభం నెల‌కొంది. ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులతో నేతన్నల జీవితాలు దుర్భరంగా మారుతున్నాయి. మీ ప్రభుత్వానికి కనీస కనికరం లేదు. పని కల్పించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు ఏదో ఒక రూపంలో ఆందోళన చేస్తున్నా మీ ప్రభుత్వంలో చలనం లేదు. ఆదుకోవాల్సిన అధికార పార్టీ నేతలే కార్మికులను అవమానించేలా మాట్లాడటం.. వారి మనోస్థైర్యాన్ని మరింత దెబ్బతీస్తోంది.

"ఇటీవల కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం ప్రతి కార్మికుని గుండెను గాయపరిచింది. ఈ క్రమంలోనే ఆర్థిక ఇబ్బందులతో సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శ్రీనివాస్ అనే నేత కార్మికుడు ఉరేసుకుని చనిపోయాడు. ఇది ఆత్మహత్య కాదు. ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యగానే నేతన్నలు భావిస్తున్నారు. నేతన్నలపై కాంగ్రెస్‌కు ఉన్న చిన్నచూపు ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టంగా అర్థమవుతోంది".

"నేత‌న్నల‌కు ఆర్డర్లు ఆపడం స‌రికాదు. బీఆర్ఎస్ హ‌యాంలో మాదిరే నేత‌న్నల‌కు చేతినిండా ప‌ని క‌ల్పించాలి. బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వడంతోపాటు ఎన్నికల కోడ్ వల్ల ఆపిన పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి. చేనేత మిత్రా వంటి పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప‌క్కన పెట్టింది. ప్రస్తుతం అందుతున్న అన్నీ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేయాలి. అవసర‌మైతే మరింత సాయం చేసి ఆదుకోవాలి. మా మీద కక్షతో నేతన్నల పొట్ట కొట్టడంసరి కాదు. రైతన్న మాదిరే, నేతన్నలు ఆత్మహత్యలు చేసుకోవడం అత్యంత బాధాకరం. వస్త్ర పరిశ్రమను ఆదుకోకపోతే కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించక తప్పదు" అని రేవంత్ సర్కారును హెచ్చరించారు కేటీఆర్.

Tags:    
Advertisement

Similar News