రేవంత్.. ఇది మీ చేతగానితనం కాదా - కేటీఆర్

IMD లెక్కల ప్రకారం 2023-24 సంవత్సరంలో తెలంగాణలో సాధారణం కంటే 14 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైందని.. నీటి సమస్య తీర్చే చేవలక, చేత కాక.. లోటు వర్షపాతం అని సీఎం రేవంత్‌ మాట్లాడడం విడ్డూరం అన్నారు కేటీఆర్.

Advertisement
Update:2024-03-07 11:46 IST

రాష్ట్రంలో కరవు పరిస్థితులు ఉన్నాయని.. రైతులు జాగ్రత్తగా ఉండాలంటూ రైతు నేస్తం ప్రారంభ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన విషయం తెలిసిందే. గతేడాది తక్కువ వర్షపాతం నమోదు కావడం వల్లే ఈ పరిస్థితులు నెలకొన్నాయంటూ ఆయన వివరణ ఇచ్చారు. కరీంనగర్, నల్గొండ, ఖమ్మం ప్రాంతాల్లో సాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు రేవంత్.

అయితే రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. IMD లెక్కల ప్రకారం 2023-24 సంవత్సరంలో తెలంగాణలో సాధారణం కంటే 14 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైందని.. నీటి సమస్య తీర్చే చేవలక, చేత కాక.. లోటు వర్షపాతం అని సీఎం రేవంత్‌ మాట్లాడడం విడ్డూరం అన్నారు కేటీఆర్.

అబద్ధాలు, అలవి కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ తీరును తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారంటూ ట్వీట్‌ చేశారు కేటీఆర్. రైతు సమస్యలు తీరుస్తానని చెప్పడం అటుంచి.. రైతులు అర్థం చేసుకోవాలనడం ఏంటన్నారు రేవంత్. రైతులు అర్థం చేసుకోవాల్సింది మీ చేతగానితనాన్న అంటూ ప్రశ్నించారు.

Tags:    
Advertisement

Similar News